యంగ్ అండ్ డైనమిక్ హీరో నవీన్ పోలిశెట్టి, స్వీటీ బ్యూటీ అనుష్క శెట్టి కలిసి నటిస్తున్న సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. నవీన్ పొలిశెట్టి స్టాండప్ కమెడియన్‌గా, అనుష్క చెఫ్‌గా నటిస్తున్న ఈ మూవీని మహేష్ బాబు.పి డైరెక్ట్ చేస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఈ సినిమాలోని ఓ పాట పాడేందుకు నానా హంగామా చేశాడు నవీన్ పోలిశెట్టి. ఈ మధ్య హీరోలే తమ చిత్రాల్లో పాటలు పాడుకుంటున్నారనీ తనూ పాడుకుంటానని చెబుతూ.. అటు నిర్మాత, మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్ ల వద్ద ఓ రేంజ్ లో బిల్డప్ ఇచ్చాడు, సరే అని మ్యూజిక్ డైరెక్టర్ రధన్ నవీన్ పోలిశెట్టికి మైక్ ఇచ్చాడు. తీరా అతన పాడుతుంటే ప్యాన్ ఇండియన్ స్టార్ హీరో ధనుష్ వాయిస్ వినిపిస్తోంది.
Read Also: Ram Charan: పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం ఊహించని కాంబినేషన్ సెట్…
మరి ఇదెలా సాధ్యం అంటే.. సింపుల్.. ఈ మూవీ కోసం నిజంగానే ధనుష్ పాట పాడాడు. అనౌన్స్‌మెంట్ వీడియోలో, నవీన్ తన దర్శకుడిని మరియు నిర్మాతను తాను పాట పాడతాను అని ఒప్పించే ప్రయత్నం చూశాం కానీ వారు అతని తమాషా ప్రయత్నాలను తిరస్కరించారు. ఈ పాటకోసం ధనుష్‌ను తీసుకువచ్చారు.”హతవిధీ ఏందిదీ.. ఊహలో లేనిదీ.. బుల్లిచీమ బతుకుపై బుల్డోజరైనదీ..” అంటూ సాగే ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. మే 31న ధనుష్ పాడుతున్న లిరికల్ వీడియో సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేయబోతున్నారు. నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ అదిరిపోతుంది అనే విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ కామెడీ టైమింగ్ సాంగ్ అనౌన్స్మెంట్ వీడియో మొత్తం ఉంది, చూసి ఎంజాయ్ చేసేయండి.
Boys! He Sing Song… Here’s our next Song Singer Announcement… 😉 #Hathavidi Lyrical video from #MissShettyMrPolishetty Releasing on May 31st 🎶
🔗https://t.co/z236ITi8N7@MsAnushkaShetty @naveenpolishety @filmymahesh @radhanmusic @ramjowrites #NiravShah #RajeevanNambiar…
— UV Creations (@UV_Creations) May 27, 2023