Pallavi Prashanth Arrested By telangana Police: గత కొద్దిరోజులుగా చర్చనీయాంశంగా మారిన బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 17వ తేదీ ఆదివారం రాత్రి బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఫినాలే జరిగింది. ఈ ఫినాలే లో పల్లవి ప్రశాంత్ సీజన్ సెవెన్ విన్నర్ గా నిలిచాడు కప్ తీసుకున్న తర్వాత పోలీసుల సూచనల మేరకు చాలాసేపు బిగ్ బాస్ యాజమాన్యం ఆయనను అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ఉంచింది. ఆ తర్వాత ఆయనను వెనుక గేటుగుండా బయటకు పంపించే ప్రయత్నం చేశారు. అయితే అలా వెనుక గేటు నుంచి బయటకు వెళ్లిన పల్లవి ప్రశాంత్ తాను గెలిచి ఇలా వెళ్లిపోవడం కరెక్ట్ కాదని భావించి మరోసారి అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు తన కారులో వచ్చాడు. ఈ నేపథ్యంలో అక్కడ ఆయన కోసం ఎదురుచూస్తున్న అభిమానులు పెద్ద ఎత్తున ర్యాలీగా ఆయన వెంట వెళ్లే ప్రయత్నం చేశారు.
Naga Chaitanya : ‘ఉడిపి’లో పని మొదలెట్టిన తండేల్
ఈ క్రమంలో పోలీసులు పల్లవి ప్రశాంత్ కారు అడ్డుకొని మీరు ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోకపోతే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది అని హెచ్చరించాక కూడా పల్లవి ప్రశాంత్ తాను ఒక రైతు బిడ్డను, ఇలా ఒక కప్పు గెలిచిన తర్వాత తన ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అయితే నిజానికి అంతకుముందే పల్లవి ప్రశాంత్ అభిమానులుగా చెబుతున్న కొంతమంది అమర్ దీప్, గీతూ రాయల్, అశ్విని శ్రీ వంటి వారి కార్లను డామేజ్ చేశారు. అయితే పోలీసులు చెబుతున్నా వినకుండా పల్లవి ప్రశాంత్ ర్యాలీ చేయడంతో అతని మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుల్లో ఏ -ఫోర్, ఏ -ఫైవ్ గా ఉన్న పల్లవి ప్రశాంత్ కారు డ్రైవర్లను నిన్న సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించగా ఈ రోజు గజ్వేల్ లోని కొల్గూరులోని తన నివాసంలో ఉన్న పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గజ్వేల్ మండలం అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు.. అన్నపూర్ణ స్టూడియో దగ్గర గొడవ కేసులో అరెస్ట్ అయ్యాడని తెలుస్తోంది. ప్రశాంత్ అభిమానులు జూబ్లీహిల్స్‌లో బీభత్సం సృష్టించిన దాడుల్లో పలువురు పోలీసులకు గాయాలు, పోలీసు వాహనాలు, ఆర్టీసీ బస్సులు ధ్వంసం అయ్యాయి. దీంతో పల్లవి ప్రశాంత్‌పై 9 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయగా ఇపుడు ప్రశాంత్‌తో పాటు అతని సోదరుడు రవిరాజు అరెస్ట్ అయ్యాడు. మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి రిమాండ్ కు తరలించే అవకాశం కనిపిస్తోంది.