ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‌లో నెంబర్ వన్ స్టార్ ఎవరంటే.. చెప్పడం కాస్త కష్టమే. కానీ ప్రముఖ ఓర్మాక్స్ మీడియా సంస్థ.. గత కొన్నేళ్లుగా ప్రతీ నెల సోషల్ మీడియాలో.. వివిధ భాషల్లో మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితాను విడుదల చేస్తూ వస్తోంది. తాజాగా ఏప్రిల్ నెలకు సంబంధించి పాన్ ఇండియా వైడ్.. అత్యంత ప్రజాదరణ పొందిన మేల్, ఫీమేల్ స్టార్స్ జాబితాను రిలీజ్ చేసింది. మరి ఈ సర్వేలో ఎవరు నెంబర్ ప్లేస్‌లో నిలిచారు..?
ఓర్మాక్స్ మీడియా సర్వే ప్రకారం.. తమిళ హీరో విజయ్ అగ్రస్థానంలో నిలిచారు. గతంలో ఇదే సర్వేలో టాలీవుడ్ హీరోల్లో టాప్ ప్లేస్‌లో నిలిచిన ఎన్టీఆర్.. ఇప్పుడు మోస్ట్ పాపులర్ పాన్ ఇండియా స్టార్స్ లిస్టులో రెండో స్థానాన్ని సంపాదించారు. ఆ తర్వాత 3వ స్థానంలో ప్రభాస్, 4వ స్థానంలో అల్లు అర్జున్ ఉన్నారు. అలాగే 8వ ప్లేస్ లో రామ్ చరణ్.. 10వ స్థానంలో మహేష్ బాబు నిలిచారు. ఇక కోలీవుడ్ నుంచి అజిత్ 6 స్థానం.. సూర్య 9 ప్లేస్‌లో నిలిచారు. రీసెంట్‌గా కెజియఫ్‌తో రికార్డులు క్రియేట్ చేసిన కన్నడ రాకింగ్ స్టార్ యష్ 7 ప్లేస్ దక్కించుకున్నారు.
ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఈ లిస్ట్‌లో సౌత్ స్టార్లే ఎక్కువగా ఉన్నారు. పది మందిలో తొమ్మిది మంది సౌత్ స్టార్సే ఉన్నారు. బాలీవుడ్ నుంచి ఒక్క అక్షయ్ కుమార్ మాత్రమే ఐదో స్థానంలో నిలిచారు. మొత్తంగా ఈ లిస్ట్‌లో టాలీవుడ్ నుంచి 5గురు చోటు దక్కించుకోగా.. కోలీవుడ్ నుంచి ముగ్గురు.. కన్నడ, హిందీ నుంచి ఒక్కో స్టార్‌కు చోటు దక్కింది. ఇక పాన్ ఇండియా ఫిమేల్ స్టార్స్ లిస్ట్‌లో సమంత టాప్‌లో నిలిచింది. ఆ తర్వాత బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ రెండోస్థానంతో సరిపెట్టుకుంది. ఈ లిస్ట్ టాప్ టెన్‌లో సౌత్ హీరోయిన్ల హవానే ఎక్కువగా ఉంది. పది మందిలో ఏడుగురు సౌత్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లే కావడం విశేషం. వాళ్లలో లేడీ సూపర్‌స్టార్ నయనతార మూడోస్థానంలో ఉండగా.. కాజల్ అగర్వాల్ నాలుగోస్థానంలో ఉంది. దీపికా పదుకోనే ఐదోస్థానంలో నిలవగా.. ఆ తర్వాత రష్మిక, అనుష్క శెట్టి, కత్రినా కైఫ్, కీర్తి సురేశ్, పూజా హెగ్డే చోటు దక్కించుకున్నారు. ఇలా మొత్తంగా ఏప్రిల్ నెలలో పాన్ ఇండియా రేంజ్‌లో సమంత టాప్ ప్లేస్‌లో.. ఎన్టీఆర్ సెకండ్ ప్లేస్‌లో నిలిచారని చెప్పొచ్చు. ఏదేమైనా ఓర్మాక్స్ మీడియా సర్వే.. హీరోలకు నెంబర్స్ కేటాయిస్తూ.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతోంది.