Ooru Peru Bhairavakona Teaser: ప్రస్తుతం హర్రర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. దెయ్యాలు, భూతాలు, చేతబడులు.. ఇవే ప్రధానాంశంగా తెరకెక్కే చిత్రాలే సూపర్ హిట్ అవుతున్నాయి. దీంతో కుర్ర హీరోలు, డైరెక్టర్లతో పట్టుబట్టి హర్రర్ సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. ఈ మధ్యనే విరూపాక్ష సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. చేతబడులు నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గత నెల రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. అంతే కాకుండా ప్లాపుల్లో ఉన్న తేజ్ ను గట్టెక్కించింది. ఇక అదే స్టైల్లో ట్రై చేసి .. తాను కూడా ట్రై చేసి హిట్ అందుకోవాలని చూస్తున్నాడు కుర్ర హీరో సందీప్ కిషన్. ప్రస్తుతం సందీప్ కు హిట్ చాలా అవసరం.. అప్పుడెప్పుడో నిన్ను వీడని నీడను నేనే అనే హర్రర్ సినిమాతో హిట్ కొట్టిన సందీప్.. ఈసారి కూడా అదే ఫార్ములాను నమ్ముకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇక ఫాంటసీ డ్రామాలకు బ్రాండ్ అంబాసిడర్ అయిన విఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ నటిస్తున్న తాజా చిత్రం ఊరు పేరు భైరవకోన. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సందీప్ఇ కిషన్ సరసన వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక నేడు సందీప్ కిషన్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేసి సందీప్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది.
The Kerala Story: తమిళనాడు మల్టీప్లెక్స్ థియేటర్లలో “కేరళస్టోరీ” సినిమా బంద్..
“శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో ఉన్నప్పటి గరుడ పురాణానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న గరుడ పురాణానికి 4 పేజీలు తగ్గాయి” అని ఒక లేడీ చెప్పడంతో టీజర్ మొదలయ్యింది. గరుడ పురాణం అనగానే అపరిచితుడు సినిమా గుర్తొస్తుంది. అందులో మనుషులు ఏ తప్పు చేస్తే ఎలాంటి శిక్షలు విధిస్తారో క్లుప్తంగా రాసి ఉంటుంది. అలాంటి గ్రంథంలో నాలుగు పేజీలు మిస్ అయితే.. ఆ మిస్ అయిన పేజీలే.. భైరవకోన అని చెప్పి ఆసక్తి పెంచారు. విరూపాక్షలో చూపించినట్టే.. ఒకే ఊరు .. ఆ ఊరులోకి వెళ్లిన వారు బయటికి పోరు.. అదే చేతబడులు.. అదే మిస్టరీ.. ఆ మిస్టరీని ఛేదించడానికి వచ్చే హీరో.. అక్కడే ఉండే హీరోయిన్ తో ప్రేమలో పడడం.. ఆ తరువాత ఏమైంది..? అనేది కథ .. ఈ టీజర్ లో కూడా అదే కనిపిస్తోంది. అయితే టీజర్ లో కనిపించే విజువల్స్ అన్ని చాలా రిచ్ గా కనిపిస్తున్నాయి. గరుడ పురాణంలో మిస్ అయిన ఆ నాలుగు పేజీల్లోఉన్న కథ ఏంటి అని ఇప్పటికే అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టేశారు. మొత్తానికి టీజర్ తోనే ఇంట్రెస్ట్ ను కలిగించారు మేకర్స్.. ఇకపోతే ఈ సినిమాత్వరలోనే రిలీజ్ కానుంది. మరి ఈ సందీప్ కు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.