ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డు కలెక్షన్ల మోత మోగించిన విషయం విదితమే. ఇక ఇందులో సమంత ఐటెం సాంగ్ ఊ అంటావా ఊఊ అంటావా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ విన్నా, ఎక్కడ చూసినా ఈ సాంగే.. యూట్యూబ్ లో రికార్డులను బద్దలుకొట్టిన ఈ సాంగ్ ప్రస్తుతం పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ గా మారింది. తాజాగా ఈ సాంగ్ ని అల్ట్రా మైమీ మ్యూజిక్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. యూఎస్ ఫ్లోరిడాలోని మైమీ పట్టణలో జరిగే బిగ్గెస్ట్ మ్యూజిక్ ఫెస్టివల్ లో ఊ అంటావా ఊఊ అంటావా సాంగ్ మారుమ్రోగింది.
లక్షలాది మంది అభిమానుల మధ్య ఈ సాంగ్ వీడియోను కూడా ప్లే చేస్తూ సమంత.. సమంత అంటూ ఫ్యాన్స్ అరవడం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఇక ఈ వీడియోను ఒక నెటిజన్ సామ్ కి షేర్ చేస్తూ ” అల్ట్రా మైమీలో ఊ అంటావా ఊఊ అంటావా సాంగ్.. కనీసం చెప్పడానికి కూడా నమ్మశక్యంగా లేని రీచ్.. పాన్ ఇండియానా బొక్కా.. అల్లు అర్జున్ పాన్ వరల్డ్.. అతిపెద్ద మ్యూజిక్ ఫెస్టివల్ లో పుష్ప మ్యానియా” అంటూ రాసుకొచ్చాడు. ఇక దీనికి సామ్ సమాధానము ఇస్తూ ” నిజమేనా ? ఇది అల్ట్రా మైమీ మ్యూజిక్ ఫెస్టివల్ లోనా ? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది” ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.