Om Bheem Bush Getting Huge Positive Buzz Before Release: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో ఓం భీమ్ బుష్ అనే సినిమా తెరకెక్కింది. హుషారు లాంటి యూత్ ఫుల్ సబ్జెక్ట్ డీల్ చేసిన హర్ష కానుగంటి దర్శకత్వంలో యువి క్రియేషన్స్, వి సెల్యులాయిడ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ తో పాటు ట్రైలర్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న క్రమంలో ఈ సినిమా మీద బజ్ నెమ్మదిగా పెరుగుతోంది. నిజానికి ఓం భీమ్ బుష్ ట్రైలర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ అయినప్పటి నుంచి ఒక్కసారిగా సినిమా మీద అంచనాలు పెంచేసింది ట్రైలర్. ట్రైలర్ తో సాలిడ్ హిలేరియస్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అనే విషయం క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ సినిమా మీద మేకర్స్ చాలా నమ్మకం పెట్టుకున్నారు. కామెడీ సినిమాల్లో ఒక పాత్ బ్రేకింగ్ సినిమా అవుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య తెలుగు ఆడియన్స్ కామెడీ ఎంటర్టైనర్ లకు పట్టం కడుతున్నారు.
Hanu-Man: థియేటర్లనే కాదు ఓటీటీని కూడా షేక్ చేస్తోన్న హనుమాన్.. రికార్డులు బద్దలు!
అదే విషయాన్ని జాతి రత్నాలు, సామజవరగమన, మాడ్ లాంటి సినిమాలు ప్రూవ్ చేస్తున్నాయి. ఇక ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, శ్రీ విష్ణు కలిసికట్టుగా చేస్తున్న ప్రమోషన్స్ థీమ్ బేస్డ్ ఇంటర్వ్యూలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. బాంగ్ బ్రోస్ అనే కాన్సెప్ట్ బేస్డ్ ప్రమోషన్స్ తో దూసుకుపోతున్న ఓం భీమ్ బుష్ టీం జాతి రత్నాలు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణతో కలిసి సామజవరగమన శ్రీ విష్ణుతో కలిసి చేయబోయే మ్యాజిక్ వేరే లెవల్లో ఉంటుందని అంటున్నారు. ఈ ముగ్గురూ కలిసి బ్రోచేవారెవరురా అనే సినిమా చేశారు. ఆ సినిమా కూడా మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు వారి కాంబోలో వస్తున్న ఈ సినిమా మరింత పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నారు మేకర్స్. ట్రైలర్ ప్రకారం అయితే సినిమాలో ట్రెజర్ హంట్, హారర్, థ్రిల్లర్ మొదలైన ఇతర అంశాలు ఉన్నాయి. ఇక ఈ ముగ్గురు హీరోల కామెడీ టైమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ లోనే కనిపిస్తోంది. సినిమాకు ముందే లాజిక్స్ లేవు అని రాశారు కాబట్టి.. ఎలాంటి లాజిక్స్ లేకుండా సినిమా చూస్తే మాత్రం మూడుగంటలు నవ్వుకోవడం పక్కా అని మేకర్స్ ఘంటాపథంగా చెబుతున్నారు.