Hanu Man trending globally with 102 million streaming minutes]: ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన హనుమాన్ సినిమా ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. 92 ఏళ్ల తెలుగు సినిమా సంక్రాంతి రికార్డులు అన్నింటినీ బద్దలు కొట్టి ఆల్ టైం బ్లాక్ బస్టర్ మూవీగా దాదాపు 350 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. తెలుగు సహా తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఒక రేంజ్ కలెక్షన్లు రాబట్టడమే కాదు మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. తేజ సజ్జ, అమృత అయ్యర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్ కుమార్, గెటప్ శ్రీను, కమెడియన్ సత్య వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మొదటి సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.
Sundeep Kishan: చిరు కోసం రాసిన కథే కానీ సందీప్ కి వచ్చేసరికి…
వారందరి ఎదురుచూపులు ఫలించే విధంగా దాదాపు 66 రోజుల తర్వాత ఈ సినిమా జి ఫైవ్ యాప్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ధియేటర్లలో ఒక రేంజ్ లో హిట్ అయిన ఈ సినిమా ఓటీటీలో కూడా దాదాపు అదే రేంజ్ వ్యూయర్ షిప్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా ఆల్ టైం హయ్యెస్ట్ రికార్డ్ వ్యూస్ తీసుకొచ్చినట్లు జి ఫైవ్ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. సినిమా స్ట్రీమింగ్ మొదలుపెట్టిన 11 గంటలలోనే 102 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ నమోదు అయినట్లు వెల్లడించింది. ఇక ఆ సంఖ్య సమయం పెరుగుతున్న కొద్దీ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కువగా థియేటర్లలో హైప్ ఇచ్చారంటూ సోషల్ మీడియాలో ఒక వర్గం కామెంట్లు చేస్తోంది. అయితే వారికి చెంపపెట్టులా ఓటీటీలో వ్యూయర్ షిప్ కనిపిస్తోంది.