Odela2 : మిల్కీ బ్యూటీ తమన్నా మెయిన్ లీడ్ రోల్ చేస్తున్న ఓదెల-2కు భారీ క్రేజ్ వస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ మూవీకి ప్లస్ అయింది. ఒక్క టీజర్ తోనే భారీగా అంచనాలు పెరిగాయి. దీంతో సినిమా భారీగా బిజినెస్ చేస్తోంది. ఇప్పటికే ఓటీటీ స్ట్రీమింగ్, ఆడియో హక్కుల రూపంలో రూ.18 కోట్లు వచ్చాయి. ఇప్పుడు తాజాగా తెలుగు థియేట్రికల్ రైట్స్ కు రూ.10 కోట్లు వచ్చాయి. అంటే మొత్తం రూ.28 కోట్లు. ఈ మూవీ బడ్జెట్ రూ.25 కోట్లు. రిలీజ్ కు ముందే రూ.3 కోట్లు లాభాలు వచ్చేశాయి. శాటిలైట్ రైట్స్ కూడా బిజినెస్ జరిగితే మరింత లాభాలు పెరుగుతాయి.
Read Also : Pamban Bridge: రాముడి సేతు నుంచి మోదీ పంబన్ వరకూ..!
తమిళ, కన్నడ, మలయాళ రైట్స్ ఇంకా చేతిలోనే ఉన్నాయి. అటు హిందీలో నేరుగా రిలీజ్ చేయబోతున్నారు మూవీ నిర్మాతలు. ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇందులో తమన్నా నాగసాధువుగా నటిస్తోంది. అశోక్ తేజ డైరెక్ట్ చేస్తుండగా.. సంపత్ నంది పర్యవేక్షించారు. ఈ మూవీని సంపత్ నంది, డి.మధు కలిసి నిర్మించారు. మూవీపై అంచనాలు భారీగా ఉండటంతో బిజినెస్ లెక్కలు పెరుగుతున్నాయి. మూవీ ట్రైలర్ ను ఏప్రిల్ 8న ముంబైలో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 17న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.