బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్, మొన్నటి అందాలభామ కాజోల్ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. నిజానికి వారిద్దరూ కలసి నటించడం లేదు, పైగా కాజోల్ కు మునుపటిలా సినిమాలూ లేవు. మరెందుకలాగా… అంటారా? వారి ముద్దుల కూతురు నైసా ఎక్కడ కనిపించినా, పేపరాజ్జీ వెంటాడుతోంది. నైసా ఎక్కడైనా కనిపిస్తే చాలు ఫోటోగ్రాఫర్స్ తమ షెట్టర్స్ కు పనిచెబుతున్నారు. క్లిక్… క్లిక్… క్లిక్… అంటూ మోత మోగిస్తున్నారు. దీంతో నైసా తన ప్రైవసీ కోసం పరుగులు తీయాల్సి వస్తోంది. అయినా, నైసా బొమ్మ కనిపిస్తే చాలనీ అజయ్, కాజోల్ అభిమానులు ఆశిస్తున్నారు.
నైసాకు తల్లిదండ్రుల బాటలోనే నటనలో అడుగు పెట్టే ఉద్దేశం ఏమైనా ఉందా? స్టార్స్ పిల్లల గురించి ఎవరికైనా వచ్చే డౌట్ ఇదే. అందువల్ల అజయ్ దేవగన్ ను సైతం అందరూ ‘మీ అమ్మాయి నైసాను ఎప్పుడు పరిచయం చేస్తారు?’ అని ఇంటర్వ్యూలలో ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లలు నటనలోనే అడుగు పెట్టాలని తామేమీ కోరుకోవడం లేదని, వారికి ఇష్టమైన రంగంలో వాళ్ళు రాణించవచ్చని అజయ్ తెలిపారు. ఇక నైసా విషయానికి వస్తే, ఆమె ప్రస్తుతం స్విట్జర్లాండ్ గ్లియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ లో ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ చదువుతోంది. ఇంతకు ముందు సింగపూర్ లో స్కూలింగ్ పూర్తి చేసింది. నైసా చదువుతున్న డిగ్రీ మేనేజ్ మెంట్ కు సంబంధించింది. మరి ఆమె కన్నవారిలాగే నటనలో అడుగు పెడుతుందా? లేక తనకు ఇష్టమైన మేనేజ్ మెంట్ లో రాణిస్తుందా? చూడాలి ఏమవుతుందో?