యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మూవీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో రూపొందించనున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. ఇక నెక్స్ట్ తారక్ కోసం పైప్ లైన్ లో ఉన్న ప్రాజెక్టుల విషయానికొస్తే… బుచ్చిబాబు, ప్రశాంత్ నీల్ వెయిటింగ్ లో ఉన్నారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ – బుచ్చిబాబు కాంబోలో రానున్న సినిమా ‘ఎన్టీఆర్ 31’ అని, ‘ఎన్టీఆర్ 32’కు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించనున్నారు అని అంటున్నారు.
Read Also : దుబాయ్ లో కాజల్… రీజన్ స్పెషలే మరి !
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ‘సలార్’ సినిమాతో బిజీగా ఉన్నారు. అంతవరకు ఎన్టీఆర్ ఈ రెండు ప్రాజెక్టులకు కంప్లీట్ చేయాలనీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ ‘సలార్’ సినిమా పూర్తయ్యాక ఎన్టీఆర్ తో కలిసి పని చేయనున్నారు. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించిన గ్రాండ్ లాంచ్ అక్టోబర్ లో జరగనుంది. ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ ఇంటరెస్టింగ్ సబ్జెక్టు ను రెడీ చేస్తున్నాడని టాక్.