యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ కోసం సినీ అభిమానులు ఎన్నో ఏళ్ల పాటు వెయిట్ చేశారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ త్రివిక్రమ్, ఎన్టీఆర్ లు కలిసి ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా చేశారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఆఫ్టర్ వార్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తారక్ యాక్టింగ్ కి, త్రివిక్రమ్ రైటింగ్ కలిస్తే ఎలా ఉంటుందో జస్ట్ సాంపిల్ చూపించిన ఈ మూవీ నందమూరి అభిమానులకి ఫుల్ మీల్స్ పెట్టింది. ముఖ్యంగా అరవింద సమేత సినిమా ఓపెనింగ్ సీక్వెన్స్ చూసిన తర్వాత త్రివిక్రమ్ లో ఈ రేంజ్ మాస్ డైరెక్టర్ ఉన్నాడా అని ఆశ్చర్యపోయారు. అరవింద సమేత సినిమా ఇచ్చిన జోష్ లో ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రెండో సినిమా అనౌన్స్ అయ్యింది.
ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని అంతా డిసైడ్ కూడా అయ్యారు కానీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాలతో సినిమా చేస్తుంటే త్రివిక్రమ్, మహేశ్ తో సినిమా చేస్తున్నాడు. ఈ కమిట్మెంట్స్ అయ్యాకా ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. త్రివిక్రమ్, ఇంకో స్టార్ హీరో ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడితో ఎన్టీఆర్ కి, త్రివిక్రమ్ కి ఉన్న కమిట్మెంట్స్ కంప్లీట్ అవుతాయి. ఆ తర్వాత ఇద్దరూ కలిసి పాన్ ఇండియా సినిమా చేస్తారు అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు ప్రొడ్యూసర్ నాగవంశీ. సార్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ మాట్లాడుతూ.. “నేను ఎన్టీఆర్ గారికి ఓ వీర అభిమాని అనేది అందరికీ తెలిసిన విషయమే. మా బ్యానర్ లో కొన్ని అనుకోని కారణాలవల్ల ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ల కాంబో మూవీ ఆగిపోయింది. రాబోయే రోజుల్లో మా బ్యానర్ లో ఎన్టీఆర్ తో ఇప్పటివరకు ఎవరూ చేయని భారీ పౌరాణిక సినిమా చేయాలనే ఆలోచన ఉంది. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతుంది ” అని చెప్పాడు.
నందమూరి కుటుంబం అనగానే పౌరాణికం అద్భుతంగా చేస్తారు అనే పేరుంది. ఆ పేరుని ఆ ఎన్టీఆర్ నుంచి ఈ ఎన్టీఆర్ వరకూ అందరూ నిలబెట్టుకుంటూనే వస్తున్నారు. పేజీల కొద్దీ ఉన్న డైలాగులు, ఆ హావభావాలు ఇవ్వడంలో ఎన్టీఆర్ నట విశ్వరూపాన్నే చూపిస్తాడు. కమర్షియల్ సినిమాలు చేసే త్రివిక్రమ్ పౌరాణికంలో సినిమాలు చెయ్యలేదు కానీ ఆయనకి ఆ విషయాలు కొత్త కాదు. త్రివిక్రమ్ క్యాజువల్ గా మాట్లాడుతుంటేనే ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి. అలాంటిది సినిమా చేస్తే ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే ప్రస్తుతం పాన్ ఇండియా ట్యాగ్ కమర్షియల్, మాస్ సినిమాలు వస్తున్నాయి. ఆ మాటని బ్రేక్ చేస్తూ… తమ స్ట్రెంత్ ని నమ్ముకుంటూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ లు కలిసి పౌరాణికం సినిమా చేసి ఏ రేంజులో ఆడియన్స్ అట్రాక్ట్ చేస్తారో చూడాలి.