మార్చ్ 5 నుంచి ఎన్టీఆర్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఎన్టీఆర్ ఆస్కార్స్ కోసం యుఎస్ వెళ్లిన దగ్గర నుంచి ఇప్పటివరకూ ఎన్టీఆర్ పేరుని ట్రెండ్ చేస్తూనే ఉన్న ఫాన్స్… తాజాగా #NTR #ManofMassesNTR అనే టాగ్స్ ని ట్రెండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆస్కార్ ఈవెంట్ ముగించుకోని హైదరాబాద్ వచ్చేసాడు. అమిగోస్ ప్రీరిలీజ్ ఈవెంట్ తర్వాత నందమూరి అభిమానులతో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వని ఎన్టీఆర్, ఈరోజు బయటకి రానున్నాడు. తనకి అతి పెద్ద ఫ్యాన్ అయిన హీరో మాస్ కా దాస్ నటించిన ‘దాస్ కా ధమ్కీ’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం శిల్ప కళా వేదికలో జరగనుంది. ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ ఛీఫ్ గెస్టుగా రానున్నాడు. విశ్వక్ సేన్ కి ఎన్టీఆర్ ఫాన్స్ లో స్పెషల్ క్రేజ్ ఉంది. విశ్వక్ తన ఫేవరేట్ హీరో గురించి ప్రీరిలీజ్ ఈవెంట్ స్టేజ్ పైన ఎలాంట్ ఎలివేషన్స్ ఇస్తాడు అని నందమూరి అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఇప్పటివరకూ తెలుగులో మాత్రమే సినిమాలు చేస్తూ మాస్ కా దాస్ అనిపించుకున్న విశ్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాడు. ఫిబ్రవరి 17న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ డిలే మరియు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో డిలే కారణంగా వాయిదా పడి ఇప్పుడు దాస్ కా ధమ్కీ సినిమా మార్చ్ 22న ఆడియన్స్ ముందుకి రానుంది. మిడ్ వీక్ లో, ఉగాది పండగ రోజున మేకర్స్ ధమ్కీ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ కలిసి వస్తుండడంతో విశ్వక్ సేన్ సినిమాకి కాస్త పాజిటివ్ టాక్ వస్తే చాలు ఫస్ట్ మండేకే బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది.