ఎన్టీఆర్-కొరటాల సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు నందమూరి అభిమానులు. ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయి నెలలు గడుస్తున్నాయి.. అయినా ఈ ప్రాజెక్ట్ మాత్రం సెట్స్ పైకి వెళ్లడం లేదు.. సరి కదా.. ఇంకా వెనక్కి వెళ్తున్నట్టు తెలుస్తోంది. ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో.. దీని పై భారీ అంచనాలున్నాయి. పైగా ట్రిపుల్ ఆర్ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు నందమూరి అభిమానులు. దాంతో ఇటీవలే ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ని రిలీజ్ చేసి కాస్త ఖుషీ చేశారు. కానీ సినిమా మాత్రం ఇంకా మొదలు కావడం లేదు. ఈ విషయంలో నందమూరి ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురవుతున్నారు. అందుకు తగ్గట్టే ఈ సినిమాపై ఇండస్ట్రీలో రోజుకో రూమర్ వినిపిస్తోంది.
ఆచార్య దెబ్బకు కొరటాల పకడ్బందిగా ప్లాన్ చేస్తున్నాడని.. కానీ ఇంకా స్క్రిప్టు మాత్రం లాక్ చేయడం లేదని తెలుస్తోంది. ఇదే సినిమా లేట్ అవడానికి అసలు కారణమని ప్రచారం జరుగుతోంది. అయితే ఆచార్య రిలీజ్ ఇన్ని రోజులు అవుతున్నా.. ఇంకా కొరటాల స్క్రిప్టు పైనే కసరత్తులు చేస్తున్నాడా… అనేది సందేహంగా మారింది. వాస్తవానికి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ జూలై నుంచి జరుపుకోబోతుందని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పుడు జూలై నెల కూడా వచ్చేసింది.. కానీ, సినిమా షూటింగ్ గురించి ఎలాంటి అప్టేట్ ఇవ్వడం లేదు. దాంతో తాజాగా ఫిలిం నగర్లో మరో న్యూస్ హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాను జూలై చివర్లో లేదా ఆగష్టులో స్టార్ట్ చేసే సూచనలు లేవట..సెప్టెంబర్‌లో మొదలు పెట్టబోతున్నారని వినిపిస్తోంది. దాంతో అసలు ఈ సినిమా ఎందుకు లేట్ అవుతోంది.. కారణాలేంటి.. అనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఏమైనా క్లారిటీ ఇస్తే బాగుంటుందని అంటున్నారు అభిమానులు. మరి ఎన్టీఆర్ 30 ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి.