23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి మరణించిన నందమూరి తారక రత్న భౌతికకాయాన్ని, బెంగుళూరు నుంచి హైదరాబాద్ కి అంబులెన్స్ లో తరలించారు. మోకిలలోని తారక రత్న సొంత ఇంటిలో కుటుంబ సభ్యుల సందర్శనార్ధం తారక రత్న భౌతిక కాయాన్ని ఉంచారు. నందమూరి సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు తారక రత్న ఇంటికి చేరుకున్నారు. కోలుకొని తిరిగి ప్రాణాలతో బయటకి వస్తాడు అని ఎదురు చూసిన అన్న మరణించడం ఎన్టీఆర్ ని కలిచివేసినట్లు ఉంది. మౌనంగా ఒక చోట కూర్చున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కళ్యాణ్ రామ్, విజయ సాయి రెడ్డితో మాట్లాడుతూ కనిపించాడు. ఈ వీడియోలో ఎన్టీఆర్ ని చూసిన వాళ్లు, నువ్వు బాధపడకు అన్నా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.