నందమూరి తారక రత్న మరణ వార్త మరిచిపోక ముందే దక్షిణాదిలో మరో నటుడు మరణించిన వర్త బయటకి వచ్చింది. తమిళ చిత్ర పరిశ్రమలో 200 పైగా సినిమాల్లో నటించిన ప్రముఖ నటుడు ఆర్. మయిల్‌సామీ తుది శ్వాస విడిచారు. 57 వయస్సులో అనారోగ్యం కారణంగా ఫిబ్రవరి 19 తెల్లవారుజామున మయిల్ సామీ మరణించారు. కార్డియాక్ అరెస్ట్ కావడంతో మయిల్‌సామీని కుటుంబ సభ్యులు ‘పోరూర్ రామచంద్ర’ ఆసుపత్రిలో అడ్మిట్ చెయ్యడానికి తీసుకోని వెళ్లారు. హాస్పిటల్ చేరుకునే లోపే మయిల్‌సామీ మృతి…
నందమూరి తారకరత్న మరణ వార్తను తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. 23 రోజులుగా ఆస్పత్రిలో పోరాడుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. తారకరత్న భౌతికకాయాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్‌లోని మోకిలాలోని ఆయన నివాసానికి తరలించారు. తారకరత్న మృతి తెలుగు సినీ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తింది. ఆయన ఆకస్మిక మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తారక రత్న మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ తన…
23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి మరణించిన నందమూరి తారక రత్న భౌతికకాయాన్ని, బెంగుళూరు నుంచి హైదరాబాద్ కి అంబులెన్స్ లో తరలించారు. మోకిలలోని తారక రత్న సొంత ఇంటిలో కుటుంబ సభ్యుల సందర్శనార్ధం తారక రత్న భౌతిక కాయాన్ని ఉంచారు. నందమూరి సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు తారక రత్న ఇంటికి చేరుకున్నారు. కోలుకొని తిరిగి ప్రాణాలతో బయటకి వస్తాడు అని ఎదురు చూసిన అన్న మరణించడం ఎన్టీఆర్ ని కలిచివేసినట్లు ఉంది.…
నందమూరి తారకరత్న 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి మహా శివరాత్రి రోజునే శివైక్యం అయ్యారు. నందమూరి అభిమానులనే కాదు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలని, ఇండస్ట్రీ వర్గాలని కూడా తారక రత్న మరణం కలచివేస్తుంది. 39 ఏళ్ల వయసులోనే తారక రత్న చనిపోవడం అందరినీ బాధిస్తోంది. ఫార్మాలిటీస్ పూర్తి చేసి తారక రత్న భౌతికకాయాన్ని బెంగళూరు నుంచి ఉదయం అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తీసుకోని వచ్చారు. ఆయన పార్థివ దేహాన్ని నేరుగా మోకిలలోని స్వగృహానికి తీసుకోని వచ్చారు.…