నందమూరి తారకరత్న అకాల మరణం తెలుగు దేశం పార్టీ కార్యకర్తలని, నందమూరి అభిమానులని, సినిమా వర్గాలని దిగ్భ్రాంతికి గురి చేసింది. 23 రోజులపాటు మృత్యువుతో పోరాడి శనివారం నాడు తుది శ్వాస విడిచిన తారకరత్న భౌతికకాయాన్ని ఫిల్మ్ ఛాంబర్ లో అభిమానుల సందర్శనార్ధం ఉంచారు. ఈ కార్యక్రమాలని నందమూరి బాలకృష్ణ అన్నీ తానై చూసుకుంటున్నాడు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఫ్యామిలీతో పాటు తారకరత్న భౌతికకాయానికి నివాళులు అర్పించారు. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు తారకరత్న భౌతికకాయాన్ని…
23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి మరణించిన నందమూరి తారక రత్న భౌతికకాయాన్ని, బెంగుళూరు నుంచి హైదరాబాద్ కి అంబులెన్స్ లో తరలించారు. మోకిలలోని తారక రత్న సొంత ఇంటిలో కుటుంబ సభ్యుల సందర్శనార్ధం తారక రత్న భౌతిక కాయాన్ని ఉంచారు. నందమూరి సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు తారక రత్న ఇంటికి చేరుకున్నారు. కోలుకొని తిరిగి ప్రాణాలతో బయటకి వస్తాడు అని ఎదురు చూసిన అన్న మరణించడం ఎన్టీఆర్ ని కలిచివేసినట్లు ఉంది.…