Jr. N. T. Rama Rao Farm House టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరైన ఎన్టీఆర్ తన ఫామ్ హౌస్ కు తను నటించిన సినిమా పేరు పెట్టుకున్నారు. గత ఏడాది ఎన్టీఆర్ హైదరాబాద్ శివార్లలో భూమిని కొన్నారు. అక్కడ విశాలమైన ఫామ్‌హౌస్‌ను అభివృద్ధి చేశారు. ఆరున్నర ఎకరాల్లో ఉన్న ఫామ్ హౌస్ లో చక్కటి తోటను పెంచారు. భార్య లక్ష్మీ ప్రణతికి పుట్టినరోజు కానుకగా దీనిని బహూకరించాడు జూనియర్. ఈ ఫామ్‌హౌస్‌లో మిత్రులకు, కుటుంబ సభ్యులకు పార్టీలు ఇస్తున్నాడు. ఇక ఈ ఫామ్ హౌస్‌కి ‘బృందావనం’ అనే పేరు పెట్టాడు తారక్. దాదాపు 12 సంవత్సరాల క్రితం దిల్ రాజు బ్యానర్ లో ఎన్టీఆర్ ‘బృందావనం’ అనే సినిమా చేశాడు. వంవీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా తన కెరీర్ లో వన్ ఆఫ్ ద హిట్ గా నిలిచింది. తన ఫామ్ హౌస్ కి ‘బృందావనం’ కరెక్ట్ నేమ్ గా భావించి ఆ పేరు పెట్టుకున్నాడు ఎన్టీఆర్. రాజమౌళితో తన స్నేహితుడు రామ్ చరణ్ తో కలసి ఎన్టీఆర్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ ఈ ఏడాది విడుదలై ఘన విజయం సాధించింది. ప్రస్తుతం కొరటాల శివతో సినిమా చేయవలసి ఉంది. వీరి కలయికలో ఇంతకు ముందు ‘జనతా గ్యారేజ్’ రూపొంది చక్కటి విజయాన్ని సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం తారక్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.