యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. కొమురం భీమ్ గా ఆడియన్స్ ని మెప్పించిన ఎన్టీఆర్, ఇప్పుడు ‘దేవర’గా పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. జనతా గ్యారేజ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ కొరటాల శివ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో భయానికి భయం పుట్టించే వీరుడి కథగా దేవర తెరకెక్కుతోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, దేవరకి విలన్ గా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నాడు. ఒక్క పోస్టర్ తోనే సినిమాపైన అంచనాలు మరింత పెంచారు కొరటాల శివ అండ్ టీం దేవర సినిమాని రెండు పార్ట్స్ గా ఆడియన్స్ ముందుకి తీసుకోని రాబోతున్నారు. ఇప్పటికే దేవర టూ పార్ట్స్ విషయంలో అఫీషియల్ అప్డేట్ ఇచ్చేసిన కొరటాల శివ, బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ లో షరా వేగంగా షూటింగ్ చేస్తున్నాడు.
దసరా పండగ సందర్భంగా షూటింగ్ బ్రేక్ తీసుకున్న ఎన్టీఆర్, కొరటాల శివ అండ్ టీమ్… కొత్త షెడ్యూల్ కి రెడీ అవుతున్నారు. అక్టోబర్ 24 నుంచి దేవర లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవనుంది. ఎన్టీఆర్-జాన్వీ కపూర్ కలిసి షూటింగ్ చేయనున్న ఈ షెడ్యూల్ ని గోవాలో ప్లాన్ చేసాడట కొరటాల శివ. ఇప్పటివరకూ దేవర షూటింగ్ ఎక్కువ శాతం హైదరాబాద్ లోనే ఇండోర్ షూటింగ్ చేసారు. ఇప్పుడు మొదటిసారి శంషాబాద్, రామోజీ ఫిల్మ్ సిటీలని దాటి గోలా వెళ్తున్నారు. లొకేషన్ మారినా సముద్రాన్ని మాత్రం దేవర వదిలిపెట్టట్లేదు. ఒక హ్యూజ్ యాక్షన్ ఎపిసోడ్ తో పాటు కొంత టాకీ పార్ట్ ని కూడా ఈ షెడ్యూల్ లో షూట్ చేయనున్నాడు కొరటాల శివ. నవంబర్ లాస్ట్ వీక్ కి ఎన్టీఆర్ దేవర సినిమాలో తన పార్ట్ కాంప్లీట్ చేయనున్నాడు. అక్కడి నుంచి 2024 ఏప్రిల్ వరకూ రిలీజ్ కి గ్యాప్ ఉంది కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ లో క్వాలిటీ అవుట్పుట్ తీసుకోని రావడానికి కావాల్సినంత సమయం దొరుకుతుంది.