యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల విషయంలో ఏం జరుగుతుందో అర్ధంకాని పరిస్థితి నెలకొంది. ఏ మూవీ ఎప్పుడు సెట్స్ పై ఉంటుంది? నెక్స్ట్ ఏ మూవీ స్టార్ట్ అవుతుంది అనే విషయంలో అసలు క్లారిటీ లేదు. ఒకప్పుడు దేవర అయిపోగానే ఎన్టీఆర్-నీల్ సినిమా ఉంటుంది, అది అయిపోగానే వార్ 2 ఉంటుంది అనుకున్నారు. ఆ తర్వాత దేవర, వార్ 2, ఎన్టీఆర్ 31 అయ్యాయి. ఇప్పుడు ఇది కూడా వర్కౌట్ అయ్యేలా కనిపించట్లేదు. ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వాల్సిన దేవర సైఫ్ యాక్సిడెంట్ కారణంగా షూటింగ్ డిలే అవుతోంది. సరే సైఫ్ యాక్సిడెంట్ అయ్యింది దేవర డిలేలో వార్ 2 అయినా ఎన్టీఆర్ స్టార్ట్ చేస్తాడు అనుకుంటే ఇప్పుడు హ్రితిక్ రోషన్ షూటింగ్ లో పాల్గొనే పరిస్థితిలో కనిపించట్లేదు. హ్రితిక్ రోషన్ కి ఇంజ్యురి అవ్వడంతో వార్ 2 ఇప్పట్లో స్టార్ట్ అయ్యే అవకాశం కనిపించట్లేదు. దీంతో దేవర కంప్లీట్ అవ్వగానే ఎన్టీఆర్ ఏ సెట్స్ లో జాయిన్ అవుతాడు అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి.
ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ సినిమా కూడా సలార్ 2 తర్వాతే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఎన్టీఆర్ వార్ 2 సెట్స్ లో జాయిన్ అయినా కూడా హ్రితిక్ రోషన్ లేని సీన్స్ ని అయాన్ ముఖర్జీ షూట్ చేయాల్సి ఉంటుంది. హ్రితిక్ నార్మల్ అయ్యాక ఎన్టీఆర్ మళ్లీ వార్ 2 కోసం డేట్స్ అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎటు చూసినా దేవర సినిమా మరో నెల రోజుల్లో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ వార్ 2లో జాయిన్ అవుతాడా? దేవర 2ని కంటిన్యూ చేస్తాడా? నీల్ ని లైనప్ చేస్తాడా? లేక ఈ గ్యాప్ లో మాటల మాంత్రికుడితో ప్రాజెక్ట్ చేస్తాడా? అసలు ఎన్టీఆర్ లైనప్ ఏంటి అనే విషయాలు తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.