యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మలయాళ నటుడు ‘షైన్ టామ్ చాకో’ పేరుని ట్రెండ్ చేస్తున్నారు. దసరా సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయిన ఈ మలయాళ నటుడు ‘తల్లుమల్లా’, ‘ఇష్క్’, ‘కురుప్’, ‘భీష్మపర్వం’ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో సపోర్టింగ్ యాక్టర్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. మలయాళంలో బిజీగా ఉంటూనే తెలుగులోకి దసరా సినిమాతో ఎంట్రీ ఇచ్చి, మొదటి సినిమాతోనే ఆడియన్స్ ని మెప్పించాడు. విలన్ కాబట్టి గట్టిగా అరవాలి, పెద్ద పెద్ద డైలాగులు చెప్పాలి అనేలా కాకుండా తనకి ఇచ్చిన క్యారెక్టర్ ని చాలా సెటిల్డ్ గా చేసిన టామ్ చాకో పుట్టిన రోజు కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ విషెష్ చెప్తూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. దసరా, రంగబలి సినిమాల్లో నటించిన షైన్ టామ్ చాకో ప్రస్తుతం ఎన్టీఆర్ తో దేవర సినిమాలో నటిస్తున్నాడు.
కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాలో షైన్ టామ్ చాకోకి ఎన్టీఆర్ మధ్య సీన్స్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పెక్యూలర్ డైలాగ్ డెలివరీ ఉన్న షైన్ టామ్ చాకోకి ఎన్టీఆర్ మధ్య సాలిడ్ సీన్స్ పడితే సినిమా సూపర్బ్ గా వర్కౌట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దసరా సినిమా తర్వాత షైన్ టామ్ చాకో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాడు. రకరకాల ఇంటర్వూస్ లో షైన్ టామ్ చాకో చేసిన అల్లరి, యాంకర్ ని టీజింగ్ చేయడం లాంటి విషయాలు టామ్ ని ఆడియన్స్ కి మరింత దగ్గర చేసాయి. చాలా సరదాగా, కొంచెం వెరైటీగా ఉండే షైన్ టామ్ చాకో టాలీవుడ్ లో మరిన్ని సినిమాలు చేసి ఇక్కడ ఫుల్ బిజీ అయిపోతే తెలుగులో చాలా రోజుల తర్వాత ఒక మంచి పరభాషా నటుడు దొరికినట్లు అవుతుంది.