Devara: 100 రోజుల్లో దేశం మొత్తం దేవరాట్టం చేస్తుంది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రిపుల్ ఆర్, ఆచార్య రిలీజ్ అవకముందే… NTR30 వర్కింగ్ టైటిల్‌తో భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు యంగ్ టైగర్ అండ్ కొరటాల. ట్రిపుల్ ఆర్ హిట్ అయింది కానీ… ఆచార్యా దారుణంగా ఫ్లాప్ అయింది. ఎంతలా అంటే… ఆచార్య సినిమా రిలీజ్ అయిన తర్వాత… కొరటాల మహా అయితే రెండు మూడు సార్లు మీడియా ముందుకు వచ్చి ఉంటాడు. అది కూడా ఎన్టీఆర్ 30 ఓపెనింగ్ డే, దేవర పార్ట్ 2ని అనౌన్స్ చేసినప్పుడేనని చెప్పాలి. ఈ లెక్కన ఆచార్యతో కొరటాల ఎంత హర్ట్ అయ్యాడో అర్థం చేసుకోవచ్చు. కొరటాల స్టోరీ టెల్లింగ్ పైనే నెగటివ్ కామెంట్స్ వచ్చాయి… ఈ సమయంలో కావాల్సింది మాటలు కాదు, చేతలు… అంటూ సైలెంట్ అయిపోయి కంబ్యాక్ ఇవ్వడానికి వైలెంట్‌గా దేవర షూటింగ్ చేస్తున్నాడు కొరటాల. స్క్రిప్టు కోసం చాలా సమయం తీసుకున్న కొరటాల… షూటింగ్‌ను మాత్రం పక్కా ప్లానింగ్‌తో అనుకున్న సమయానికి కంప్లీట్ చేశాడు. ఇప్పటికే దేవర 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.
జనవరిలో ఫస్ట్ వీక్‌లో గ్లింప్స్ రిలీజ్ చేసి… అదే సమయంలో దేవరకు ప్యాకప్ చెప్పేసి పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పై ఫోకస్ చేయనున్నాడు కొరటాల. ఇప్పటి నుంచి సరిగ్గా మరో వంద రోజుల్లో దేవర థియేటర్లోకి రానుంది. ఏప్రిల్ 5న దేవర రిలీజ్ కానుంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు టైగర్ ఫ్యాన్స్ పైగా అనిరుధ్ టీజర్ రెడీ అంటూ అప్డేట్ ఇచ్చాడు. మేకర్స్ కూడా… All Hail TheTiger in theaters in 100 days from today.. And we can’t wait to unveil the glimpse soon.. అంటూ ట్వీట్ చేసారు. దీంతో దేవర కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి.. జనవరి ఫస్ట్ వీక్‌లో నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాను కబ్జా చేయడం పక్కా. సముద్రం బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న దేవరలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తుండగా.. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
#AllHailTheTiger in theaters in 100 days from today. #Devara @tarak9999 #KoratalaSiva 🔥🔥
And we can’t wait to unveil the glimpse soon. ❤️🔥
— Devara (@DevaraMovie) December 27, 2023
తాజావార్తలు
-
Harish Rao: రైతులకు ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర..? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
-
Explainer: విదేశీ పేదోళ్ల ముందు.. మన ధనికులు కూడా వేస్ట్!
-
Vaibhav Sooryavanshi: “ఇది నిరంకుశత్వం”.. గంభీర్‌పై వైభవ్ సూర్యవంశీ కోచ్ ఫైర్..
ట్రెండింగ్
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!