సలార్ సీజ్ ఫైర్ తో బాక్సాఫీస్ ని సీజ్ చేసిన ప్రశాంత్ నీల్… పార్ట్ 1 ఎండింగ్ మిస్ అవ్వకండి అని చెప్పి క్లైమాక్స్ లో పెద్ద షాకే ఇచ్చాడు. క్లైమాక్స్ కంప్లీట్ అయ్యే కొన్ని క్షణాల ముందు, ఎండ్ క్రెడిట్స్ పడే చోట అదిరిపోయే సీక్వెన్స్ ని పెట్టాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ తో చొక్కా విప్పించి, చేతిలో కత్తి పెట్టి… అభిమానుల చొక్కాలు చింపుకునేలా చేసిన ప్రశాంత్ నీల్… సలార్ పార్ట్ 2 టైటిల్ “శౌర్యాంగ పర్వం” అని రివీల్ చేసాడు. ప్రభాస్-పృథ్వీల మధ్య ఉన్న స్నేహం వైరంగా ఎలా మారింది అనే పాయింట్ తో పాటు ప్రభాస్ ప్లే చేసిన దేవరథ క్యారెక్టర్ కి ఒక ఊహించని ట్విస్ట్ ఇచ్చి… ఆ ట్విస్ట్ తో శౌర్యాంగ పర్వం సినిమాని రన్ చేయబోతున్నాడు ప్రశాంత్ నీల్. ఈ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ప్రశాంత్ నీల్ చెప్పలేదు కానీ ఇప్పుడు శౌర్యాంగ పర్వం సినిమా అనుకున్న దానికన్నా ముందే సెట్స్ పైకి వెళ్లేలా కనిపిస్తోంది.
నిజానికి సలార్ సీజ్ ఫైర్ అయిపోగానే ప్రశాంత్ నీల్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాల్సి ఉంది. సలార్ రెండు పార్ట్స్ అవ్వడం, దేవర రెండు పార్ట్స్ అవ్వడంతో ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లడానికి లేట్ అవుతోంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ ప్రకారం అయితే ఎన్టీఆర్ 31 మూవీ ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి వెళ్లాలి. ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే ఇది జరిగేలా కనిపించట్లేదు. సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం షూటింగ్ ని ప్రశాంత్ నీల్ మొదలుపెట్టే అవకాశం కనిపిస్తోంది. 20 రోజుల పాటు రెస్ట్ తీసుకోని నెక్స్ట్ సినిమాపై దృష్టి పెట్టనున్నాడు నీల్. ఎన్టీఆర్ దేవర షూటింగ్ ని జనవరి నెలలో కంప్లీట్ చేసి వార్ 2 స్టార్ట్ చేయనున్నాడు.
వార్ 2 సినిమాకి తక్కువ కాల్ షీట్స్ అవసర పడతాయి కాబట్టి అన్నీ అనుకున్నట్లు జరిగితే ఎన్టీఆర్ ఏప్రిల్, మేకి ఫ్రీ అయిపోతాడు. ఒకవేళ ఎన్టీఆర్ ఆ తర్వాత దేవర 2 బాలన్స్ షూట్ స్టార్ట్ చేసినా, ప్రశాంత్ నీల్ సలార్ 2 బాలన్స్ షూట్ స్టార్ట్ చేసినా ఎన్టీఆర్ 31 డిలే అవుతుంది. సలార్ 2 ఎండ్ అయ్యే టైములో ఎన్టీఆర్ 31ని అఫీషియల్ గా లాంచ్ చేసి… సలార్ 2 కంప్లీట్ అయిన తర్వాత ఎన్టీఆర్ 31 స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. ప్రశాంత్ నీల్ KGF 2 సమయంలో కూడా… యష్ తో షూటింగ్ స్టార్ట్ చేసి ప్రభాస్ తో సలార్ లాంచ్ చేసాడు ప్రశాంత్ నీల్. ఇదే స్ట్రాటజీని ఎన్టీఆర్ 31కి ఫాలో అయ్యి… సలార్ 2 షూటింగ్ అయిపోయే సమయానికి ఎన్టీఆర్ 31 లాంచ్ అయ్యే అవకాశం ఉంది.