యంగ్ టైగర్ ఎన్టీఆర్, కమర్షియల్ సినిమాలకి కొత్త అర్ధం చెప్పిన కొరటాల శివ ‘జనతా గ్యారేజ్’ తర్వాత కలిసి ఒక సినిమా చేస్తున్నారు. జనతా గ్యారేజ్ తో రీజనల్ బాక్సాఫీస్ ని మాత్రమే షేక్ చేసిన ఎన్టీఆర్, కొరటాల శివ ఈసారి బాక్సాఫీస్ రిపైర్లని పాన్ ఇండియా స్థాయిలో చెయ్యడానికి రెడీ అవుతున్నారు. ‘ఎన్టీఆర్ 30’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటివలే స్టార్ట్ అయ్యింది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ‘ఎన్టీఆర్ 30’ లేటెస్ట్ షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. నేషనల్ అవార్డ్ విన్నర్ సైఫ్ అలీ ఖాన్ సెట్స్ లో జాయిన్ అయ్యాడు. సైఫ్ అలా వచ్చాడో లేదో కొరటాల శివ, హ్యూజ్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీలోని ఒక కొండ పైన జాతర సెటప్ బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్-సైఫ్ అలీ ఖాన్ మధ్య సీన్స్ ని కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు. సైఫ్ అండ్ ఎన్టీఆర్ మంచి పెర్ఫర్మార్స్ కావడంతో ఈ ఇద్దరి మధ్య పోటాపోటీగా సీన్స్ ఛాన్స్ ఉంది.
సముద్రం బ్యాక్ డ్రాప్ లో కొరటాల శివ రాసిన ఒక వీరుడి కథ ‘ఎన్టీఆర్ 30’. అనౌన్స్మెంట్ తోనే భారి అంచనాలు ఏర్పడిన ఈ మూవీ నుంచి రెగ్యులర్ అప్డేట్స్ ని రిలీజ్ చేస్తూ మేకర్స్ రోజురోజుకీ హైప్ పెంచుతున్నారు. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ‘ఎన్టీఆర్ 30’ చిత్ర యూనిట్ రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. మరో నెల రోజుల్లో ఎన్టీఆర్ పుట్టిన రోజు ఉంది కాబట్టి మే 20న ‘ఎన్టీఆర్ 30’ ఫస్ట్ లుక్ ని కానీ ఒక చిన్న గ్లిమ్ప్స్ ని కానీ మేకర్స్ రిలీజ్ చేస్తే పాన్ ఇండియా మొత్తం ఊగిపోవడం ఖాయం. మరి మే 20న కొరటాల శివ నందమూరి అభిమానులకి, పాన్ ఇండియా ఎన్టీఆర్ ఫాన్స్ కి ఎలాంటి గిఫ్ట్ ఇస్తాడో చూడాలి.