Horror: అప్పుడు ‘రాజుగారి గది’… ఇప్పుడు ‘రాణిగారి గది…’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Roshan: ‘రాజుగారి గది’ సీరిస్ తో తెలుగులో వచ్చిన మూడు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ప్రముఖ యాంకర్ ఓంకార్ ఈ చిత్రాలను హారర్ నేపథ్యంలో తెరకెక్కించారు. తాజాగా ఇప్పుడు అదే బాటలో ‘రాణిగారి గదిలో దెయ్యం’ పేరుతో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. రోషన్, సాక్షి, స్రవంతి, పూజా డే ఇందులో కీలక పాత్రలను పోషించారు. అబిద్ దర్శకత్వంలో మౌంట్ ఎవరెస్ట్ పిక్చర్స్ పతాకంపై పి. వి. సత్యనారాయణ దీన్ని నిర్మించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘రాణిగారి గదిలో దెయ్యం’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇటీవల హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్, ఆర్.కె. గౌడ్ ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ మాట్లాడుతూ “హారర్ కంటెంట్ చిత్రాలకి ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ఈ చిత్రం సక్సెస్ కావాలి’’ అని అన్నారు. నిర్మాత పి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ “మా బ్యానర్ నుండి వస్తున్న ఐదో సినిమా ఇది. హారర్ కాన్సెప్ట్‌తో వినోదాత్మకంగా సాగే చిత్రమిది. త్వరలో విడుదల చేస్తాం’’ అని తెలిపారు. దర్శకుడు అబిద్ మాట్లాడుతూ “నన్ను నమ్మి నిర్మాత అవకాశం ఇచ్చారు. హారర్ కథతో చక్కని సినిమా తీశాం. షేర్ చక్కని సంగీతం అందించారు. ఈ జర్నీలో చాలామంది నాకు సహకరించారు” అని చెప్పారు. సిరాజ్ మాట్లాడుతూ “తెలుగు ఇండస్ట్రీలో దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా, డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నాను. నా మొదటి సినిమా నుంచి ప్రసన్నకుమార్ సపోర్ట్ చేస్తున్నారు. మంచి కథతో ఈ సినిమా చేశాం. చక్కని పాటలు కుదిరాయి” అని తెలిపారు. ఈ సినిమాలో అవకాశం ఇవ్వడం పట్ల నటీనటులు ఆనందం వ్యక్తం చేసి, సినిమా సక్సెస్ కావాలని ఆకాంక్షించారు.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు