యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం “ఆర్ఆర్ఆర్” సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మొదటిసారిగా బాలీవుడ్ మీడియాను హ్యాండిల్ చేసిన ఎన్టీఆర్ వారి ప్రశ్నలకు ఎనర్జిటిక్ గా సమాధానాలు చెప్పారు. నిన్న ముంబైలో జరిగిన “ఆర్ఆర్ఆర్” సినిమా ప్రెస్ మీట్ లో చిత్రబృందం మొత్తం పాల్గొన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ జర్నలిస్టులతో తన ఇంటరాక్షన్ సందర్భంగా యంగ్ టైగర్ కొన్ని అద్భుతమైన సమాధానాలు ఇచ్చాడు. అవి ప్రస్తుతం ట్రెండింగ్ టాపిక్‌గా మారాయి.
Read Also : ఒకే ఒక్కడు ప్రభాస్… గ్లోబల్ లెవెల్లో ఫస్ట్ ప్లేస్
దాదాపు మూడు సంవత్సరాలు పట్టిన రాజమౌళి “ఆర్ఆర్ఆర్” కోసం ఎన్ని చిత్రాలను వదులుకోవాల్సి వచ్చిందని తారక్‌ను మీడియా వ్యక్తుల్లో ఒకరు అడిగారు. ఆ ప్రశ్నకు ఎన్టీఆర్ చెప్పిన సమాధానం అక్కడున్న అందరిలో నవ్వులు పూయించింది. “నేను ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను పూర్తి చేయడంపై మాత్రమే దృష్టి పెట్టాను. ముఖ్యంగా నేను రాజమౌళి సినిమా చేస్తున్నానని తెలిసినప్పుడు నాకు మరో సినిమా ఆఫర్ ఎవరు ఇస్తారు?” అని అడిగాడు. ఇక నిన్న ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ను చూస్తుంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ సినిమా కోసం కేటాయించిన మూడు సంవత్సరాల సమయం విలువైనదే అన్పిస్తుంది. మరి రాజమౌళి సినిమా అంటే ఆ మాత్రం డేట్స్ కేటాయించాల్సిందే కదా.