పూజా హెగ్డే అనగానే గోల్డెన్ లెగ్, బుట్టబొమ్మా… ఈ హీరోయిన్ ఉంటే సినిమా సూపర్ హిట్ అనే మాట వినిపించేది. ఒకటా రెండా దువ్వాడ జగన్నాధం నుంచి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ వరకూ పూజా హెగ్డే ఏ సినిమాలో నటిస్తే అది హిట్ అయ్యింది. కేవలం రెండేళ్ల గ్యాప్ లోనే అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేశ్ బాబు, రామ్ చరణ్ తో నటించిన పూజా హెగ్డే స్టార్ హీరోయిన్ అయిపొయింది. దీంతో తెలుగులో టాప్ హీరోయిన్ అయిపోయి, స్టార్ స్టేటస్ అందుకుంది. తెలుగులో మంచి పొజిషన్ వచ్చిన తర్వాత అందరు హీరోయిన్లు చేసే తప్పే పూజా హెగ్డే చేసింది. సౌత్ లో క్లిక్ అయ్యాను కదా అని నార్త్ ల ప్రయత్నాలు మొదలు పెట్టింది. బాలీవుడ్ లో మంచి అవకాశాలు వచ్చాయి కానీ కెరీర్ సెట్ అయిపోయే హిట్స్ మాత్రం పడలేదు. దీంతో అటు నార్త్ ఇటు సౌత్ లో పూజా హెగ్డేకి అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. 2014 నుంచి ప్రతి సంవత్సరం ఏడాదికి కనీసం మూడు నాలుగు సినిమాలు చేసే పూజా హెగ్డేకి ప్రస్తుతం చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఇంకో రెండు నెలలు ఉంటే 2023 కంప్లీట్ అవుతుంది కానీ ఈ ఇయర్ లో పూజా హెగ్డే నటించింది ఒక్క సినిమాలోనే, అది కూడా హిందీ సినిమా.
తెలుగులో మహేష్ పక్కన గుంటూరు కారం సినిమాలో నటిస్తుంది, ఈ సినిమాతో కంబ్యాక్ ఇస్తుంది అనుకుంటే గుంటూరు కారం సినిమా నుంచే సైడ్ అయిపొయింది పూజా హెగ్డే. 2023 అనే కాదు 2022లో కూడా పూజా హెగ్డే పరిస్థితి దాదాపు ఇలానే ఉంది. కాకపోతే 2022లో పూజా హెగ్డే పాన్ ఇండియా సినిమాలు చేసింది. ప్రభాస్ తో ‘రాధే శ్యాం’, దళపతి విజయ్ తో ‘బీస్ట్’, చిరు-చరణ్ లతో ‘ఆచార్య’, రణవీర్ సింగ్ తో ‘సర్కస్’ లాంటి భారి బడ్జట్ సినిమాల్లో పూజా హెగ్డే నటించింది. ఇవి హిట్ అయితే బాగుండేది కానీ ఇందులో ఒక్క సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకోలేక పోయాయి. కొట్లలో నష్టాలు మిగిలించిన ఈ సినిమాలు పూజాకి ఐరన్ లెగ్ ముద్రని తెచ్చాయి. ఆమె ఏ సినిమాలో నటించినా, అది ఫ్లాప్ అవుతుంది అనే విమర్శలు కూడా మొదలయ్యాయి. ఇక్కడి నుంచే పూజా డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది, మరి ఈ బుట్టబొమ్మ కంబ్యాక్ ఎప్పుడు ఇస్తుందో చూడాలి.