టాలీవుడ్ హీరోయిన్ నిత్యా మీనన్ ప్రస్తుతం బీమ్లా నాయక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ముఖ్యమైన పాత్ర కావడంతో ఈ సినిమాలో నటించడానికి నిత్యా ఒప్పుకున్నట్లు మేకర్స్ ఎప్పుడో తెలిపారు. ఇక నిత్యా మల్టీ ట్యాలెంటెడ్ అన్న సంగతి తెలిసిందే. నిత్యా మంచి సింగర్. ఇప్పటికే పలు సినిమాల్లో తన గొంతు వినిపించింది కూడా . నటనతో పాటు సంగీతం అన్నా నిత్యాకు చాలా ఇష్టం. ఈ నేపథ్యంలోనే అమ్మడు కొత్త అవతారం ఎత్తనుంది. ఒక సింగింగ్ షో కి జడ్జి గా వ్యవహరించనుంది అని తెలుస్తోంది. అది కూడా తెలుగు ప్రేక్షకుల కోసం సంగీత అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్.
ప్రముఖ ఓటిటీ ఆహా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సింగింగ్ షో కి నిత్యా మీనన్ జడ్జి గా రానున్నారని తెలుస్తోంది. అందుకు సంబంధించిన ప్రోమో ఆహా మేకర్స్ రిలీజ్ చేశారు. ముఖం కనిపించకుండా నిత్యాను చూపిస్తూ.. ఈ షో కి కొత్త జడ్జిగా రానున్న సింగింగ్ సెన్సేషన్ ఎవరు గెస్ చేయండి అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఆ వీడియోలో నిత్యానే ఉందని క్లియర్ గా తెలిసిపోతుంది. వెర్సటాలిటీ ఆమె సొంతం.. మెలోడీ పాటల బంగారం ఆమె గాత్రం అంటూ నిత్యా గురించి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. మొదటిసారి నిత్యా ఒక షో కి రావడం.. అందులోను జడ్జిగా వ్యవహరించడం చాలా ఆశ్చర్యంగా ఉందంటున్నారు అభిమానులు. మరి నిత్యా జడ్జిగా ఎలా వ్యవహరించనుందో చూడాలి.
