Nithin: టైటిల్ చూసి ఏంటి నిజమా నితిన్ భార్యకు విడాకులు ఇవ్వనున్నాడా..? అని కంగారుపడకండి. రియల్ లైఫ్ లో మాత్రం కాదు.. రీల్ లైఫ్ లో.. అదేనండి తన కొత్త సినిమాలో. మాచర్ల నియోజకవర్గం సినిమాతో ఈమధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ భారీ పరాజయాన్ని అందుకున్నాడు. దీంతో నితిన్ ఈసారి ఎలాగైనా మంచి హిట్ పట్టాలని కసితో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే వరుస ప్రాజెక్ట్స్ ను పట్టాలెక్కిస్తున్నాడు. ఇప్పటికే రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ఈ సినిమాలో స్మగ్లర్ గా నితిన్ కనిపించనున్నాడు.
ఇక ఈ సినిమాతో పాటు తనకు భీష్మ లాంటి హిట్ ఇచ్చిన వెంకీ కుడుమల దర్శకత్వంలో యంగ్ హీరో ఒక సినిమా చేస్తున్నాడట. ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనున్నదట. భార్యకు విడాకులు ఇచ్చి సింగిల్ గా ఉన్న కుర్రాడి కథలో జరిగే అవమానాలను వినోదాత్మకంగా చూపించనున్నారట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ హీనులు పూర్తీ అయ్యాయని, త్వరలోనే ఈ కాంబో అధికారికంగా తమ సినిమాను ప్రకటించనున్నదని సమాచారం. మరి ఈ రెండు సినిమాలతో నితిన్ ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.