Nikhil: కార్తికేయ 2 సినిమాతో నిఖిల్ భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత వచ్చిన స్పై.. భారీ పరాజయాన్ని అందుకుంది. ఈసారి మరో హిట్ అందుకోవడానికి నిఖిల్ రెడీ అవుతున్నాడు. స్పై తరువాత నిఖిల్ నటిస్తున్న మరో పాన్ ఇండియా సినిమా స్వయంభు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో రానున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన సంయుక్త మీనన్ నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో నిఖిల్ ఒక పోరాట యోధుడులా కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం నిఖిల్ కత్తిసాము, మల్లయుద్ధం లాంటివి నేర్చుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.
పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో నిఖిల్.. హనుమంతుడి భక్తుడిగా కనిపించనున్నాడట. ఇప్పటికే హనుమాన్ సినిమాతో ఇండస్ట్రీలో హనుమంతుని భక్తుల జాబితా పెరిగిపోతుంది. ఇక నిఖిల్ కూడా ఈ సినిమాలో హనుమంతుడి భక్తుడు అంటే.. ఇందులో కూడా హనుమాన్ కనిపించే అవకాశాలు లేకపోలేదు. దీంతో ఈ సినిమా కూడా హిట్ దిశగా వెళ్తుంది అనే నమ్మకం ఉందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో నిఖిల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
#Swayambhu shooting in full swing with key sequences being shot 💥💥@actor_Nikhil will be seen as a devotee of Lord Hanuman in the film ❤️🔥@iamsamyuktha_ @krishbharat20 @RaviBasrur @manojdft @TagoreMadhu @bhuvan_sagar @PixelStudiosoff @TimesMusicHub @jungleemusicSTH pic.twitter.com/G9slIHBSQf
— Vamsi Kaka (@vamsikaka) January 16, 2024