యంగ్ హీరో నిఖిల్ దసరా సందర్భంగా నిఖిల్ తన తదుపరి ప్రాజెక్ట్ గురించి అధికారికంగా ప్రకటించాడు. దీనికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించబోతున్నారు. గతంలో నిఖిల్, సుధీర్ వర్మ ఇద్దరూ “స్వామి రారా”, “కేశవ” చిత్రాల కోసం కలిసి పని చేశారు. ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ జంట రాబోయే చిత్రం ద్వారా హ్యాట్రిక్ సాధించాలని ఆలోచిస్తోంది. ఈ కొత్త ప్రాజెక్ట్ ను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర నిర్మించనుంది.
Read Also : రస్టిక్ లుక్ లో నాని… ఆసక్తిని రేకెత్తిస్తున్న ‘దసరా’
ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా షూటింగ్ నవంబర్ 1 నుండి ప్రారంభమవుతుంది. 40 రోజుల పాటు నిరంతరాయంగా లండన్‌లో జరుగుతుంది. ఈ చిత్రం యాక్షన్ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది. ఇందులో నటించనున్న నటీనటులు, సిబ్బంది గురించి మరిన్ని వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీని నిర్వహించగా, కార్తీక్ సంగీతం సమకూర్చనున్నారు. మరోవైపు నిఖిల్ ప్రస్తుతం ‘కార్తికేయ 2′, ’18 పేజెస్’ సినిమాల్లో నటిస్తున్నారు.