మైఖేల్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా నిలబడాలి అనుకున్న యంగ్ హీరో సందీప్ కిషన్, తన బ్లడ్ అండ్ స్వెట్ ని పణంగా పెట్టి సినిమా చేశాడు. ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ని ప్రాపర్ ప్లానింగ్ తో రిలీజ్ చేస్తూ మైఖేల్ సినిమాపై అంచనాలని పెంచుతూ వచ్చిన సందీప్ కిషన్, సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం డిఫరెంట్ రిజల్ట్ ని ఫేస్ చెయ్యాల్సి వచ్చింది. హిట్ అవుతుంది అనుకున్న సినిమా నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. దీంతో పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేసిన సందీప్ కిషన్ డిజప్పాయింట్ అయ్యాడు. లేటెస్ట్ గా మరోసారి యునివర్సల్ అప్పీల్ ఉన్న థ్రిల్లింగ్ కథతో, క్రియేటివ్ గా సినిమాలు చెయ్యగల దర్శకుడు వీఐ ఆనంద్ తో కలిసి ‘ఊరిపేరు భైరవకోన’ అనే సినిమా చేస్తున్నాడు. టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం లాంటి మంచి సినిమాలని చేసిన విఐ ఆనంద్ ‘ఊరిపేరు భైరవకోన’ అనే సినిమా చేస్తున్నాడు అనగానే ఇండస్ట్రీ వర్గాలతో పాటు సినీ అభిమానుల్లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. లేటెస్ట్ గా ఈ మూవీ ప్రమోషన్స్ కి స్టార్ట్ చేస్తూ మేకర్స్… ‘నిజమే నే చెబుతున్నా’ అనే సాంగ్ ప్రోమో ను నిన్న రిలీజ్ చేశారు.
ఈ పాటని విడుదల చేస్తూ “గత కొన్ని నెలలుగా నా జోల పాట, మా బసవ భూమిల ప్రేమ పాట… నిజమేలే చెబుతున్న జానే జాన,నిన్నే నే ప్రేమిస్తున్న…” అంటూ సందీప్ కిషన్ ట్వీట్ చేశాడు. సిద్ శ్రీరామ్ పాడిన ఈ రొమాంటిక్ మెలోడీ సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటకి శ్రీ మణి లిరిక్స్ రాయగా, శేఖర్ చంద్ర కంపోజ్ చేయడం జరిగింది. సందీప్ కిషన్, వర్ష బోల్లమ్మ ల మధ్య సాగిన ఈ సాంగ్ ని సంగీత ప్రియులు, సిద్ శ్రీరామ్ అభిమానులు రిపీట్ మోడ్ లో వింటున్నారు. హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండ నిర్మించిన ఈ చిత్రం లో కావ్య థాపర్ కీలక పాత్రలో నటిస్తుండగా, రాజ్ తోట సినిమాటోగ్రఫి, చోటా కె ప్రసాద్ ఎడిటర్ లు గా వ్యవహరిస్తున్నారు. మరి ఈ సినిమాతో అయినా సందీప్ కిషన్ కంబ్యాక్ ఇస్తాడేమో చూడాలి.
గత కొన్ని నెలలుగా నా జోల పాట, మా బసవ భూమిల ప్రేమ పాట
' నిజమేలే చెబుతున్న జానే జాన,నిన్నే నే ప్రేమిస్తున్న 'I actually Love you guys a lot ..your belief in me is all I have got ❤️
@Dir_Vi_Anand #ShekharChandra @sidsriram @VarshaBollamma @KavyaThapar https://t.co/zeH4DPaGsU pic.twitter.com/kp7s8qjUgE— Sundeep Kishan (@sundeepkishan) March 31, 2023