Niharika Konidela: మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం డెడ్ పిక్సల్స్ అనే వెబ్ సిరీస్ తో నటిగా రీ ఎంట్రీ ఇస్తుంది. గత మూడేళ్ళుగా ఎన్నో అనుకోని మలుపులు వచ్చాయి. పెళ్లి, పబ్ కేస్, విడాకుల రూమర్స్.. ఇలా ఒకదాని తరవాత ఒకటి వస్తూ సోషల్ మీడియాలో నిహారికను హాట్ టాపిక్ గా మార్చాయి. ఇక ఈ వివాదాలను పక్కన పెట్టి.. నిహారిక ప్రస్తుతం కెరీర్ మీదనే ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే డెడ్ పిక్సల్స్ రిలీజ్ దగ్గరపడుతుండడటంతో వరుస ప్రమోషన్స్ చేస్తూ సిరీస్ గురించి వ్యక్తిగత విషయాల గురించి చెప్పుకొస్తుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో నిహారిక.. తనపై వస్తున్న రూమర్స్ గురించి స్పందించింది. అలాంటి రూమర్స్ గురించి కానీ, రూమర్స్ ను స్ప్రెడ్ చేసే వారి గురించి కానీ ఆలోచించనని ఖరాకండీగా చెప్పేసింది. అంతేకాకుండా రూమర్స్ స్ప్రెడ్ చేసేవారిని వెధవలు అని తిట్టేసింది కూడా..
Sai Rajesh: ‘బేబీ’ రిలీజ్ డేట్ లాక్ చేశారు!
” పనిపాట లేని వాళ్లే ట్రోల్స్ చేస్తారు. వారి గురించి నేను పట్టించుకోను. అలాంటివారు అందరు ఇడియట్స్.. వాళ్లకు అటెన్షన్ ఇచ్చాం అంటే.. చూడు నేను చేసిన వెధవపనికి సమాధానం ఇచ్చారు.. అంత అటెన్షన్ ఇస్తున్నారు అంటూ ఇంకా రెచ్చిపోతారు. అలాంటి వెధవలను పట్టించుకొనవసరం లేదు .. నేనంటే ఇష్టపడేవాళ్లు ఉన్నారు.. నేను ఇష్టపడేవాళ్లు చాలామంది ఉన్నారు. నాకు సమయం దొరికితే వాళ్లతో టైమ్ స్పెండ్ చేస్తా.. ఎవడో కోన్ కిస్కా గొట్టంగాడు ఏదో అన్నాడు అని వాడిని తిట్టుకుంటూ కూర్చోలేను. ఒకప్పుడు నాపై వచ్చే కామెంట్స్ చూసేదాన్ని.. ఇప్పుడు వాటిని చూడడం కూడా మానేశా.. అసలు ఎందుకు చూడాలి. వాడెవడో ఏదో అంటే .. నేనేందుకు పట్టించుకోవాలి. దానివలన మన ఆరోగ్యం దెబ్బతింటుంది” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.