Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మనసు సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయింది నిహారిక. మెగా కుటుంబం నుంచి మొట్టమొదటి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక దారుణంగా విఫలమైంది. దీంతో ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంది. చైతన్య జొన్నలగడ్డతో ఆమె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే పెళ్లయిన మూడేళ్లకే భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో వారిద్దరూ ఈ ఏడాది అధికారికంగా విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం నిహారిక హీరోయిన్ గా తన కెరీర్ ను మళ్ళీ మొదలు పెట్టడానికి సిద్ధమవుతుంది. నటిగా, నిర్మాతగా ఆమె ముందు ముందు విజయాలను అందుకోవడానికి బాగానే కష్టపడుతుంది. ఇక తాజాగా నిహారిక.. ఆహాలో యాంకర్ గా మారింది. చెఫ్ మంత్ర సీజన్ 3 కి హోస్ట్ గా వ్యవహరిస్తోంది. మార్చి 8 న ఈ షో మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ కూడా అయ్యింది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ” ఈ మధ్య నాకు తిండి పిచ్చి ఎక్కువ అయ్యింది. ముఖ్యంగా పప్పుచారు కనిపిస్తే అస్సలు వదలడంలేదు. ఇక ట్రావెలింగ్ కు ఎక్కువ వెళ్తున్నాను. ఏది కావాలని ప్లాన్ చేసుకొని వెళ్లడం లేదు. ఈ ట్రావెల్ కు అయ్యే ఖర్చు నేనే దాచుకుంటున్నాను. నాకు మంచి సినిమాలు చేయాలని ఉంది. కమర్షియల్ సినిమాల్లో నటించాలని ఉంది. కానీ, ఏ డైరెక్టర్ నాకు అలాంటి పాత్రలు ఆఫర్ చేయలేదు. అలాంటి పాత్రలు వస్తే కచ్చితంగా చేస్తా. ప్రస్తుతం చెఫ్ మంత్ర చేస్తున్నా.. ఈ షోలో నాన్నమ్మను, సురేఖ అమ్మను, ఉపాసన వదినను తీసుకురావాలని ఉంది. నాకు ఆడిషన్స్ కు వెళ్లడం అంటే ఇష్టం.. పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వాళ్లకు ఆడిషన్ చేయరు అంటారు. ఇప్పటికీ ఎవరైనా డైరెక్టర్ మంచి సినిమాకు నన్ను ఆడిషన్స్‌కు పిలిస్తే వెళ్తాను” అంటూ చెప్పుకొచ్చింది.