Varun Tej: రెండేళ్ల క్రితం కరోనా లాక్ డౌన్ నుంచి మొదలయ్యాయి.. తారల పెళ్లిళ్లు.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అందరూ.. సాధారణంగానో.. గ్రాండ్ గానో.. ప్రేమించిన వారిని వివాహం చేసుకొని ఒక ఇంటివారు అవుతున్నారు. ఇక ఈ మధ్య కుర్ర హీరోలు సైతం పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. ఇప్పటికే నిశ్చితార్థం కూడా చేసుకున్న శర్వా.. వచ్చే నెల పెళ్ళికి డేట్ ఫిక్స్ చేసుకున్నాడు. ఇక ఈ పెళ్లితో పాటు మెగా ప్రిన్స్ పెళ్లి వార్తలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి. మెగా బ్రదర్ నాగబాబు.. పెద్ద కొడుకు వరుణ్ తేజ్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. విషయం ఏంటంటే.. వరుణ్ తేజ్- హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో ఈ జంట కలిసి నటించారు. అప్పటినుంచే వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని టాక్. అయితే ఈ వార్తలపై వరుణ్ ఎప్పుడు స్పందించింది లేదు.. లావణ్య ఎన్నోసార్లు ఇన్ డైరెక్ట్ గా తమ మధ్య ఏది లేదని సమాధానం చెప్పుకొచ్చింది. ఇక రెండు రోజుల నుంచి ఈ జంట నిశ్చితార్థం అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి.
Pawan Kalyan: పాపం పసివాడు, నోట్లో వేలు పెడితే కొరకలేడు.. జగన్ పై పవన్ సెటైర్
ఇక అన్న పెళ్లి వార్తలపై తాజాగా నిహారిక స్పందించింది. డెడ్ పిక్సల్స్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొన్న నిహారిక.. అన్న పెళ్లి వార్తలపై స్పందించింది కానీ, సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఈ విషయం మరింత హీట్ పెంచేస్తోంది. వరుణ్- లావణ్య జూన్ లో ఎంగేజ్ మెంట్ చేసుకుంటున్నారు అంట.. నిజమేనా అన్న ప్రశ్నకు.. నిహారిక మాట్లాడుతూ.. ” ఇప్పుడు ఆ విషయం గురించి మాట్లాడాలనుకోవడం లేదు. డెడ్ పిక్సల్స్ గురించి మాత్రమే అడగండి” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో అమ్మడు సమాధానం దాటివేసింది అంటే.. ఇందులో నిజం ఉండే ఉంటుంది. లేకపోతే రూమర్ అయితే ఖరాఖండీగా ఖండించేది కదా అని చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా నిహారిక పెళ్ళికి .. రాజస్థాన్ వరకు వెళ్లిన హీరోయిన్స్ లో లావణ్య ఒకరు. అప్పుడే వీరిద్దరి పెళ్లి కన్ఫర్మ్ అనుకున్నారు. ఇంకోపక్క నాగబాబు సైతం.. వరుణ్ కు ఎవరు నచ్చితే వారికే ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పాడంతో మెగా కుటుంబం కూడా ఈ పెళ్ళికి అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. మరి అధికారికంగా ఈ జంట తమ ప్రేమను అభిమానులతో ఎప్పుడు పంచుకుంటారో చూడాలి.