Niharika Konidela: మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం నటిగా, నిర్మాతగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఒక మనసు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన నిహారిక..స్టార్ హీరోయిన్ గా మారుతుంది.అనుకున్నారు కానీ, ఆ సినిమా తరువాత పలు సినిమాలు చేసినా కూడా ఆమెకు ఆశించిన విజయాలు మాత్రం అందలేదు. దీంతో ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పి చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది, అనంతరం పింక్ ఎలిఫెంట్ బ్యానర్ ను నిర్మించి యూట్యూబ్ లో షార్ట్స్ ఫిల్మ్స్ , వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ నిర్మాతగా మారింది. నటిగా కన్నా నిర్మాతగానే నిహారిక మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక భర్తతో విడాకులు అయ్యిన తరువాత ఆమె మళ్లీ నటిగా మారడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. ఇప్పటికే డెడ్ పిక్సల్స్ అనే వెబ్ సిరీస్ లో నటించిన నిహారిక.. ప్రస్తుతం.. వెండితెరపై నిర్మాతగా డెబ్యూట్ అవుతుంది. నిహారిక న్యూ ప్రాజెక్ట్ నేడు పూజా కార్యక్రమాలను జరుపుకుంది. అంతా కొత్తవారితో కలిసి ఆమె ఒక సినిమాను నిర్మిస్తుంది.
Bigg Boss Telugu 7: విశ్వరూపం చూపించిన శివాజీ.. గేటు తీయండి బయటికి పోతా అన్న గౌతమ్
యాదు వంశీ అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాతో తెలుగుతెరకు పరిచయమవుతున్నాడు. ఇక ఈ సినిమా పూజా కార్యక్రమంలో కొత్త జంట వరుణ్ తేజ్ – లావణ్య సందడి చేశారు. వరుణ్ క్లాప్ కొట్టగా.. నాగబాబు కెమెరా స్విచ్ఛాన్ చేశాడు. పూజ అనంతరం నిహారిక మాట్లాడుతూ.. ” ఇప్పటివరకు షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ లు నిర్మించాం. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేస్తున్నాను. మొదటి నుంచి కూడా నాకు అండగా ఉన్నారు. ఇప్పుడు కూడా మీడియా నాకు అండగా ఉంటుంది అని నమ్ముతున్నాను. అంతా కొత్తవారితో ఈ సినిమా తెరకెక్కుతుంది. తెలుగు ప్రేక్షకులు కథ నచ్చితే.. ఆదరిస్తారని నమ్మకం ఉంది. థాంక్యూ” అని చెప్పుకొచ్చింది. మరి ఈ సినిమా నిహారికకు ఎలాంటి విజయాన్ని తీసుకొచ్చి పెడుతుందో చూడాలి.