Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7 ప్రస్తుతం ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. ఈ వారం మొత్తం ఫ్యామిలీ వీక్ గా మార్చిసి కుటుంబ సభ్యులను హౌస్ లోకి పంపించి ఎమోషనల్ చేసిన బిగ్ బాస్ వెంటనే కెప్టెన్సీ టాస్క్ అని చెప్పి హీట్ పెంచేశాడు. నిన్నటివరకు హౌస్ లో ప్రేమానురాగాలు విరిశాయి. ఇక ఈరోజు గేమ్ లో ఒరిజినల్ క్యారెక్టర్స్ ను బయటపెట్టారు కంటెస్టెంట్స్. మొదటినుంచి కూడా శివాజీకి గౌతమ్ కు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. శివాజీ.. హౌస్ లో పెద్దరికం ముసుగులో తప్పులు చేస్తున్నాడని, ఆయన మిగతావారిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడని గౌతమ్ చెప్పుకోస్తున్నాడు. కానీ, శివాజీ మాత్రం ఎవరి మీద తనకు ద్వేషం లేదని, ఎవరికి నచ్చిన విధంగా వారు గేమ్ ఆడుతున్నారని, గేమ్ లో తప్ప వేరే ఏ విషయంలో కూడా తనకు ఎవరిమీద కోపాలు లేవని చెప్పుకొచ్చాడు.
Superstar Krishna Statue: కృష్ణ విగ్రహావిష్కరణ.. మహేష్ బాబు ఎందుకు రాలేదు..?
ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో బేబీ గేమ్ లో గౌతమ్, శివాజీకి పోటీ పడింది. గౌతమ్ అరుస్తూ.. శివాజీని సెకండ్ బిగ్ బాస్ అని ఫీల్ అవుతున్నావా.. ? నాకు అన్యాయం జరిగిందని అరుస్తున్నాను అని ఫైర్ అవ్వగా.. శివాజీ మొట్టమొదటిసారి గట్టిగ అరుస్తూ మాట్లాడాడు. తనకు అరవడం వచ్చు అని.. గట్టిగా మాట్లాడాడు. కేవలం గౌతమ్ అటెన్షన్ కోసమే ఇదంతా చేస్తున్నావని, పాయింట్ లేకుండా ప్రతిసారి అరుస్తున్నావని శివాజీ చెప్పడంతో .. హార్ట్ అయిన గౌతమ్ వెంటనే.. గేట్ తీయండి బిగ్ బాస్ నేను వెళ్ళిపోతా అంటూ మాట్లాడాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ గొడవపై రేపు నాగార్జున ఎలా స్పందిస్తాడో చూడాలి.