Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ అంటే నిహారిక పేరే చెప్పుకోవచ్చు. ఒక మనసు సినిమాతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేనప్పటికీ నిహారికకు మంచి అవకాశాల్ని తీసుకొచ్చి పెట్టింది. కానీ, ఆమెకు విజయాలు మాత్రం దక్కలేదు. దీంతో ఆమె సినిమాలకు దూరమై పెద్దలు కుదిరించిన వివాహాన్ని చేసుకుంది. చైతన్య జొన్నలగడ్డతో ఆమె వివాహం ఉదయపూర్ లో చాలా గ్రాండ్ గా జరిగింది. అయితే కొన్ని విభేదాలు వలన ఈ జంట మూడేళ్లు కుండా నిండకుండానే విడాకులు తీసుకున్నారు. ఇక విడాకుల అనంతరం నిహారిక మరోసారి తానేంటో నిరూపించడానికి కష్టపడుతుంది. ఒకపక్క నటిగా .. ఇంకోపక్క నిర్మాతగా బిజీగా మారింది. డెడ్ పిక్సెల్ అనే వెబ్ సిరీస్ తో ఓటీడీలోకి ఎంట్రీ ఇచ్చిన నిహారిక ఇప్పుడు వెండితెరపై హీరోయిన్ గా రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే మంచు మనోజ్ తో వాట్ ద ఫిష్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా నుంచి మనోజ్ తప్పుకోగా మనోజ్ ప్లేస్ లో నిహారిక వచ్చి చేరింది.
ఇక ఇప్పుడు ఈ చిన్నది మలయాళంలో కూడా ఎంటర్ అవ్వడానికి రంగం సిద్ధమైంది. గతేడాది ఓటిటీలో రిలీజ్ అయిన సినిమాల్లో బాగా గుర్తింపు తెచ్చుకున్న చిత్రం RDX. నీల నీలవే సాంగ్ సోషల్ మీడియాలో ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ సాంగ్ ద్వారానే ఈ సినిమా బాగా పేరు తెచ్చుకుంది. అందులో హీరోగా నటించిన షేన్ నిగమ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మద్రాస్ కారాన్. వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎస్ ఆర్ ప్రొడక్షన్ బ్యానర్ పైబి జగదీష్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలోకి నిహారికను చిత్ర బృందం అధికారికంగా ఆహ్వానించింది. ఈ విషయాన్ని నిహారిక తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. మరి ఈ సినిమా నిహారికకు ఎలాంటి విజయాన్ని తీసుకొచ్చి పెడుతుందో చూడాలి.