Site icon NTV Telugu

Nidhi Agarwal : భయపెడుతా అంటున్న నిధి అగర్వాల్..

Nidhi

Nidhi

Nidhi Agarwal : అందాల బ్యూటీ నిధి అగర్వాల్ మళ్లీ వరుస సినిమాలతో బిజీ అవుతోంది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజాసాబ్ మూవీలో నటిస్తోంది. నేడు ఆమె పుట్టిన రోజు సందర్భంగా మరో మూవీని ప్రకటించారు మేకర్స్. నిధి అగర్వాల్ లీడ్ రోల్ లో నిఖిల్ కార్తీక్ దర్శకుడిగా పుప్పాల అప్పల రాజు నిర్మాతగా జ్యోతి క్రియేషన్స్ ప్రొడక్షన్ నంబర్ 1పై హర్రర్ సినిమాను అనౌన్స్ చేశారు. దసరాకు టైటిల్ ప్రకటిస్తామన్నారు. నిధి అగర్వాల్ ఇందులో లీడ్ రోల్ చేస్తోంది. మూవీ నుంచి పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో భయపెట్టే విధంగా నిధి కళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి.

Read Also : Bejawada Bebakka : కోట్లు పెట్టి ఇల్లు కొనేసిన బిగ్ బాస్ బ్యూటీ..

ఈ ప్రాజెక్ట్‌తో దర్శకుడిగా నిఖిల్ కార్తీక్.ఎన్ పరిచయం అవుతున్నారు. ఇందులో నిధి అగర్వాల్ పాత్ర అద్భుతంగా ఉంటుందని నిర్మాత పుప్పాల రాజు అన్నారు. ఇది ఆమె కెరీర్ లో మైల్ స్టోన్ అవుతుందనే నమ్మకం ఉందన్నారు. ఆమె బిగ్ స్క్రీన్ పై చూపించబోయే మేజిక్ కోసం మేమంతా ఎదురుచూస్తున్నామన్నారు. మూవీకి సంబంధించిన అప్డేట్స్ త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ప్రస్తుతం నిధి అగర్వాల్ ప్రభాస్ తో చేస్తున్న ది రాజాసాబ్ లో కూడా హర్రర్ కు సంబంధించిన పాత్రలోనే కనిపిస్తోందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఏకంగా దెయ్యం పాత్రలో కనిపిస్తుందా అనే ప్రచారం జరుగుతోంది.

Read Also : Rajini Kanth : పవన్ కల్యాణ్‌ పొలిటికల్ తుఫాన్.. రజినీకాంత్ ట్వీట్

Exit mobile version