Bejawada Bebakka : బిగ్ బాస్ తో చాలా మంది ఫేమస్ అవుతున్నారు. ఇందులో కొందరు ఇండ్లు కూడా కొనేస్తున్నారు. తాజాగా మరో బ్యూటీ ఈ లిస్టులో చేరిపోయింది. ఆమె ఎవరో కాదు బెజవాడ బేబక్క. కామెడీ వీడియోలతో బాగా ఫేమస్ అయిన ఈమె.. బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ లో పాల్గొంది. కానీ మధ్యలోనే బయటకు వచ్చేసింది. ఆమె అసలు పేరు మధు నెక్కంటి. గలగలా మాట్లాడుతూ సోషల్ మీడియాలో బాగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె కోకాపేటలో కొత్త ఇల్లు కొనేసింది. ఖరీదైన కోకాపేటలో ఓ ఫ్లాట్ ను కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
Read Also : Nagarjuna : ఆయన కోసం పార్కుల చుట్టూ తిరిగా.. నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
ఆమె ఇంటి గృహ ప్రవేశానికి హీరో శ్రీకాంత్ తో పాటు మరికొందరు నటులు, బిగ్ బాస్ కంటెస్టెంట్లు వచ్చేశారు. వీరంతా సరదాగా గడిపిన వీడియోను సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కాగా ఆమె కొన్న ఈ ఫ్లాట్ రెండు కోట్లకు పైనే ఉంటుందని తెలుస్తోంది. 25వ అంతస్థులో ఉన్న ఫ్లాట్‌నే ఏరికోరి కొనుక్కున్నట్టు తెలిపింది ఈ భామ.
Read Also : Rajini Kanth : పవన్ కల్యాణ్ పొలిటికల్ తుఫాన్.. రజినీకాంత్ ట్వీట్