Nidhi Agarwal : నిధి అగర్వాల్ టాలీవుడ్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి గ్లామర్, డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. కానీ ఏం లాభం.. ఆమె కెరీర్ మాత్రం ఊహించిన స్థాయిలో సాగలేదు. వరుస సినిమాలు చేసినా ఒక్కదానికీ పెద్ద హిట్ ట్యాగ్ రాలేదు. ఇప్పటివరకు 8 వరుస ఫ్లాపులు రావడంతో ఆమె ఫ్యాన్ బేస్ మొత్తం తగ్గిపోతోంది. సవ్యసాచి, ఇస్మార్ట్ శంకర్ తప్ప ఆ తర్వాత వచ్చిన మిస్సమ్మ, హీరో, కల్యాణ్ రామ్‌తో చేసిన సినిమా, అలాగే కొన్ని తమిళ ప్రాజెక్టులు కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయాయి.
Read Also : SSMB 29 : ప్రియాంక చోప్రా పాత్ర ఇదే.. మందాకిని పాత్రలో వేరియేషన్స్..
ఎన్నో అంచనాలతో వచ్చిన పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు కూడా ప్లాప్ అయింది. దీంతో ఆమె ఆశలన్నీ గల్లంతయ్యాయి. ఇప్పుడు ఆమెకు ఉన్న ఒకే ఒక్క దిక్కు ‘ది రాజాసాబ్’. ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో నిధి ఒక కీలక పాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా స్టైలిష్, అలాగే ఎమోషనల్ డెప్త్ ఉన్న రోల్‌గా ఉంటుందని సమాచారం. ఇది హిట్ అయితేనే ఆమెకు మంచి సినిమా ఛాన్సులు వస్తాయి. లేదంటే మాత్రం ఆమెకు సినిమా అవకాశాలు కూడా కరువే అవుతాయి.
Read Also : SSMB 29 : చడీచప్పుడు లేకుండా పోస్టర్లు.. రాజమౌళి ఏం చేస్తున్నావ్..?