ఇండియన్ బాక్సాఫీస్ తెరపై నయా ‘శక్తిమాన్’గా రణ్ వీర్ సింగ్ కనిపించబోతున్నాడు. 80లలో ఇండియన్ ఆడియన్స్ ను అద్భుతంగా అలరించిన సీరియల్స్ లో ‘శక్తిమాన్’ కూడా ఒకటి. బాషతో సంబంధం లేకుండా అందరినీ ఆకట్టుకున్న సీరియల్ అది. దూరదర్శన్ లో 500లకు పైగా ఎపిసోడ్స్ గా ప్రసారమైన ఈ సీరియల్ లో నటించిన ముఖేశ్ ఖన్నాను సూపర్ స్టార్ డమ్ తీసుకువచ్చింది ‘శక్తిమాన్’. ఇక ఈ సీరియల్ సృష్టించిన బ్రాండింగ్ అంతా ఇంతా కాదు. స్కూల్ బ్యాగ్స్ నుంచి పిల్లలు వాడే ప్రతి వస్తువు, ఆడుకునే ఆటబొమ్మలపై శక్తిమాన్ బొమ్మ ప్రత్యక్షమైందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఇప్పుడీ సీరియల్ రైట్స్ ను సోనీ పిక్చర్స్ కొనుగోలు చేసింది. తాజాగా ‘శక్తిమాన్’ గా నటించేందుకు బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. అయతే దీనిని సినిమాగా తీసుకువస్తారా? లేక లార్జర్ వే లో సీరీస్ గా రూపొందిస్తారా? అన్నది తేలలేదు. రైట్స్ ను మాత్రం సోనీ పిక్చర్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసిందట. గతంలో ఈ సీరియల్ ను చూసి ఎంజాయ్ చేసిన ఆడియన్స్ మాత్రం పెరిగిన సాంకేతికతతో ‘శక్తిమాన్’ను అద్భుతంగా తిలకించవచ్చనే ఫీల్ తో ఉన్నారు. ఇండియన్ సూపర్ మాన్ గా గుర్తింపు పొందిన ‘శక్తిమాన్’ ఇపుడు మరో సారి భారతీయ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని భావిద్దాం.