Manchu Lakshmi: మోహన్ బాబు కూతురు స్మగ్లర్ అంట..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె మాట్లాడే బాషతోనే ఎంతో ఫేమస్ అయ్యిపోయి అభిమానులలో మంచు అక్క గా మారిపోయింది. ఇక ఈమె ఏమి చేసిన ట్రోలర్స్ కు పండగే.. ఏ పని చేసినా ఆమెపై విమర్శల అస్త్రాలు సంధిస్తుంటారు. ఓవర్ యాక్షన్ చేస్తోంది అని, మంచు మోహన్ బాబు కూతురువు కాబట్టి సరిపోయింది, లేకపోతే నిన్ను ఎవరు భరిస్తారు అంటూ ఘాటుగా మంచు లక్ష్మీని ట్రోల్స్ చేస్తుంటారు. అయితే వీటిని మంచక్క లైట్ తీసుకొని తన పని ఏదో తాను చేసుకుంటూ పోతుంది. నిత్యం సోషల్ మీడియా లో రీల్స్ అని, కూతురు, మేనకోడళ్లతో కలిసి హుషారుగా ఉండే లక్ష్మీ తాజాగా తన సోషల్ మీడియా లో ఒక పోస్ట్ పెట్టి మళ్లీ ట్రోలింగ్ కు గురైంది. తన షూ కలెక్షన్స్ సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ క్యాప్షన్ గా “సరైన షూ ఎప్పుడు ఉండదు” అంటూ చెప్పుకొచ్చింది.
ఇక ఫొటోలో ఐదు జతల షూస్ ను ముందు వేసుకొని.. ఇంకేమి కొత్తవి లేనట్లు బుంగమూతి పెట్టుకొని కూర్చోంది. ఇక వెనుక మాత్రం షూ షో రూమ్ లా లెక్కలేనన్ని జతల షూస్ ఉండడం గమనార్హం. ఇక ఈ ఫొటోపై ట్రోలర్స్ విరుచుకుపడ్డారు.. అన్ని ఉన్నా నీకు ఏది వేసుకోవాలో తెలియడం లేదా.. మీరు అంతా అంతే.. కాళ్లు కాలే కాళ్లు ఒక చోట.. లెక్కలేనన్ని జోళ్లు ఒకజ చోట అని కొందరు.. షూ షాప్ ఏమైనా పెడుతున్నావా..? లేక షూ స్మగ్లింగ్ ఏమైనా చేస్తున్నావా..? అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఇంకొంతమంది మాత్రం మీ షూ కలెక్షన్స్ బావున్నాయని, మీరు ఏది వేసుకున్నా అందంగానే ఉంటుందని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
- Michael Biopic: రూ.9,500 కోట్లకు పైగా వసూళ్లు.. ప్రపంచ బాక్సాఫీస్ చరిత్ర తిరగరాసిన బయోపిక్!
- Lenin: ఫ్యాన్స్ ను ఫిదా చేయబోతున్న తమన్.. 'లెనిన్' సక్సెస్ ఈవెంట్ లో కొత్త సాంగ్ రిలీజ్
- Kiran Abbavaram : కిరణ్ అబ్బవరంపై తమిళ హీరోలు పగపట్టారా..?
- Bollywood : భారీ ధరకు 25 ఎకరాల భూమి కొనుగోలు చేసిన స్టార్ హీరో
తాజావార్తలు
-
Michael Biopic: రూ.9,500 కోట్లకు పైగా వసూళ్లు.. ప్రపంచ బాక్సాఫీస్ చరిత్ర తిరగరాసిన బయోపిక్!
-
నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
-
Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్‌లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్
-
Lenin: ఫ్యాన్స్ ను ఫిదా చేయబోతున్న తమన్.. ‘లెనిన్’ సక్సెస్ ఈవెంట్ లో కొత్త సాంగ్ రిలీజ్
-
Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్‌లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!