Tammanah: మిల్కి బ్యూటీ తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీ సినిమాతో తెలుగుతెరకు పరిచయామైన ఈ చిన్నది. హ్యాపీ డేస్ చిత్రంతో అందరికి గుర్తుండిపోయింది. ఇక తన నడుముతో, డ్యాన్స్ తో కుర్రకారును గిలిగింతలు పెట్టి.. టాలీవుడ్ లో మిల్కీ బ్యూటీగా మారిపోయింది. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన తమ్ము.. ప్రస్తుతం తెలుగులో భోళా శంకర్ చిత్రంలో చిరు సరసన నటిస్తోంది. ఇక తెలుగులో అవకాశాలు రావడం లేదని ఈ చిన్నది బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఏ ముహూర్తాన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో అడుగుపెట్టిందో కానీ, అప్పటినుంచి అమ్మడి అందాల ఆరబోతకు హద్దే లేకుండా పోయింది. తాజాగా ఆమె నటించిన రెండు వెబ్ సిరీస్ లో హద్దుమీరి రొమాన్స్ చేసి నెటిజన్ల విమర్శలను అందుకుంటుంది.
New Trend: బాలీవుడ్ స్టార్ హీరోలు.. ఏయే తెలుగు సినిమాల్లో విలన్ గా చేస్తున్నారంటే..?
తాజాగా తమన్నా నటించిన జీ కర్దా ఈ రోజు నుంచి అమేజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో తమన్నా బోల్డ్ సీన్స్ కు బూతు మాటలకు అభిమానులు బెంబేలెత్తిపోతున్నారు. అసలు ఆ శృంగార సన్నివేశాలలో తమన్నా రియాక్షన్స్.. ఆమె నోటి నుంచే బూతు మాటలు విని దేవుడా.. అంటున్నారు. అంతేకాకూండా అసలు ఎలాంటి తమన్నా ఎలా అయిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇన్నేళ్ల ఆమె కెరీర్ లో గ్లామర్ ఒలకబోసిందేమో కానీ మరీ ఇంత దారుణంగా అయితే కనిపించలేదని చెప్పుకొస్తున్నారు. ఇక ఇది కేవలం ట్రైల్ మాత్రమే.. లస్ట్ స్టోరీస్ 2 లో ప్రియుడు విజయ్ వర్మ తో ఇంకా రెచ్చిపోయిందని తెలుస్తుంది. దీంతో అభిమానులు.. ఆ బోల్డ్ సీన్స్ ఏంటి.. ఆ బూతులు ఏంటి.. అసలు నువ్వు మా తమన్నావేనా..? అంటూ విమర్శలు చేస్తున్నారు. మరి ముందు ముందు ఈ చిన్నది ఇక్కడితోనే ఆగుతుందా..? ఇంకా రెచ్చిపోతుందా..? అనేది చూడాలి.