‘బాహుబలి’ ఫ్రాంచైజీ సూపర్ సక్సెస్ తర్వాత టాప్ డిజిటల్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ‘బాహుబలి : బిఫోర్ ది బిగినింగ్’ పేరుతో వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేసింది. ఈ వెబ్ సిరీస్ శివగామి కథను వివరిస్తుంది. ముందుగా ఈ ప్రాజెక్ట్ కోసం ప్రవీణ్ సత్తారు, దేవా కట్టా డైరెక్టర్లుగా ఎంపికయ్యారు. ఇక శివగామి పాత్రలో నటించడానికి మృణాల్ ఠాకూర్ ను ఎంచుకున్నారు. కానీ కొంత చిత్రీకరణ తరువాత నెట్‌ఫ్లిక్స్ నిర్వాహకులు అవుట్ ఫుట్ పై అసంతృప్తిని వ్యక్తం చేయడంతో ప్రాజెక్ట్ కొన్నాళ్ళు ఆగింది. ఇక మృణాల్ కూడా తన డేట్స్ ఇవ్వడానికి నిరాకరించడంతో పాటు ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో మేకర్స్ హీరోయిన్ గా వామిక గబ్బిని తీసుకున్నారు.
Read Also : షాక్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్… ‘బాహుబలి’ వెబ్ సిరీస్ రద్దు
ఇక హీరోయిన్ తో పాటు దర్శకులను కూడా మార్చేశారు. కొత్త దర్శకులుగా కునాల్ దేశ్‌ముఖ్, రిభు దాస్‌గుప్తాలను బోర్డులోకి తీసుకున్నారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. దాదాపు 6 నెలల షూటింగ్ తర్వాత నెట్‌ఫ్లిక్స్ ‘బాహుబలి : బిఫోర్ ది బిగినింగ్’ను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించుకుంది. రూ. 150 కోట్ల ఈ మెగా ప్రాజెక్ట్ టీమ్ పేలవమైన ఇచ్చిన అవుట్ పుట్ కారణంగా నిలిపివేశారు. షో రన్నర్లు రూపొందించిన ఫైనల్ అవుట్ ఫుట్ తో నెట్‌ఫ్లిక్స్ మేనేజ్‌మెంట్ సంతృప్తి చెందలేదు. అందుకే వారు ప్రాజెక్ట్‌ను తక్షణమే నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. నెట్‌ఫ్లిక్స్ ఈ మెగా ప్రాజెక్ట్‌పై ఇప్పటికే రూ. 150 కోట్లకు పైగా ఖర్చు చేసింది. అయితే ప్రాజెక్ట్ ఇలా మధ్యలో ఆపివేయడం వల్ల ఆ పెట్టుబడి మొత్తం బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. మరోవైపు ఈ విషయం ‘బాహుబలి’ అభిమానులకు షాక్ ఇచ్చేదనే చెప్పాలి.