టాలీవుడ్ హీరోయిన్ నేహశెట్టి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. నేహశెట్టి నానమ్మ మృతి చెందారు. ఈ విషయాన్ని నేహా సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ ఎమోషనల్ అయ్యింది. డీజే టిల్లు విడుదల అయ్యే రెండు రోజుల ముందు ఈ ఘటన జరిగిందని, డీజే టిల్లు విజయాన్ని పంచుకోవడానికి ఆమె నాతో లేదని తెలిపింది. ఆమె నానమ్మ ఫోటోలను షేర్ చేస్తూ “నా అభిమాని, నా చీర్ లీడర్ నన్ను వదిలి వెళ్ళిపోయింది. రెండేళ్లప్పుటి నుంచి ఆమె నా నటనను ముందు వరుసలో కూర్చొని చూస్తూ ఆనందించేది. అలాంటి అవ్వ ఇప్పుడు నా విజయంలో, సంతోషంలో పాలుపంచుకోవడానికి లేదని తెలిస్తే నా హృదయం ముక్కలవుతుంది.
డీజే టిల్లు విజయాన్ని ఆమెకు అంకితమిస్తున్నా.. ఈ సినిమాను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. నేహా.. దైర్యంగా ఉండు.. మీ నానమ్మ ఆశీర్వాదాలు నీకెప్పుడు ఉంటాయి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక నేహా.. పూరి దర్శకత్వం వహించిన మెహబూబా చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైంది. డీజే టిల్లు ఆమెకు మొదటి హిట్ గా నిలిచింది.