NC 23: జాలరిగా నాగచైతన్య.. అమాంతం అంచనాలు పెంచేస్తున్న ది ఫస్ట్ కట్ డాక్యుమెంటేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NC23 Expedition The First Cut Documentation:యదార్థ సంఘటనల ఆధారంగా, రియల్ లొకేషన్‌లలో రూపొందించే సినిమాలకి ప్రీ-ప్రొడక్షన్ చాలా ముఖ్యం అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. నాగ చైతన్య 23వ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. లెజెండరీ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమాను దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడానికి మేకర్స్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందు కోసమే ఒక కొత్త విధానాన్ని అనుసరించిన మేకర్స్ ప్రీ-ప్రొడక్షన్‌ను ప్రారంభించడానికి, NC 23 టీం ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో పర్యటించింది. ముఖ్యంగా శ్రీకాకుళంలోని కె.మత్స్యలేశం గ్రామాన్ని సందర్శించింది. ఇప్పటికే ఆ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ క్రమంలో ది ఫస్ట్ కట్ డాక్యుమెంటేషన్ పేరుతో ఒక వీడియో రిలీజ్ చేశారు మేకర్స్.
Daya 2: ఆ అననుమానాలు తీర్చేసేది అప్పుడే.. దయా 2 రిలీజ్ అయ్యేది ఎప్పుడంటే?
Also Read
- Maa Inti Bangaram: సమంతకు మరో బిగ్ సక్సెస్.. కేవలం 4 రోజుల్లోనే 50 కోట్ల క్లబ్‌లోకి!
- Release Clash : ఆగస్ట్‌లో 'వైఫ్ అండ్ హస్బెండ్' మధ్య బాక్సాఫీస్ ఫైట్
- Welcome To The Jungle : బికినీ సీన్లకు సెన్సార్ బ్రేక్... 'వెల్కమ్ టు ది జంగిల్' రిలీజ్‌కు ముందే 18 కత్తెరలు..
- Exclusive : అన్న కొడుకు సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు అతిధిగా సూపర్ స్టార్ మహేశ్ బాబు
ఈ సందర్భంగా నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్‌లో కూర్చొని ఈ కథను రూపొందిచడం కాదని దర్శకుడు భావించారని అందకే. నేరుగా ఇక్కడికి వచ్చి ఇక్కడి ప్రజలు, వాతావరణాన్ని అధ్యయనం చేస్తూ చాలా జాగ్రత్తలు తీసుకుని ప్రీ ప్రొడక్షన్‌ను ముందుకు తీసుకెళ్తున్నాం అన్నారు దర్శకుడు చందూ మొండేటి మాట్లాడుతూ ఈ గ్రామానికి వచ్చి ప్రతి అంశానికి సంబంధించిన వివరాలను పరిశీలించిన తర్వాత మా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యిందని అన్నారు. హీరో నాగ చైతన్య మాట్లాడుతూ‘ పాత్రలన్నిటిని కలసి, వారి బాడీ లాంగ్వేజ్, పల్లె పరిస్థితులు, వారి జీవనశైలిని అర్ధం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చామని అన్నారు. ఇక ఈ సినిమాను మరో లెవల్ కి తీసుకెళ్లి, మత్స్యకారుల వర్క్ లైఫ్ ని అర్థం చేసుకోవడానికి NC 23 టీం సముద్రంలోకి వెళ్లింది.ఈ నేపథ్యంలో ఈ మొత్తం ప్రయాణాన్ని ది ఫస్ట్ కట్ డాక్యుమెంటేషన్ అనే డాక్యుమెంటరీగా ప్రజెంట్ చేశారు. టాలీవుడ్‌లో మునుపెన్నడూ లేని విధంగా, ఒక హీరో షూటింగ్ ప్రారంభించే ముందు లొకేషన్‌లను సందర్శించి ప్రజలతో మాట్లాడడం హాట్ టాపిక్ అవుతోంది. నాగ చైతన్య ప్రీ ప్రొడక్షన్ పనుల్లో పాల్గొంటూ ప్రాజెక్ట్ పై తన ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్న వైనం గురించి టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
తాజావార్తలు
-
Pune: పూణెలో మరో సోనమ్.. పెళ్లికి ముందే కాబోయే భర్తను పైకి పంపేసింది
-
Rishabh Pant: ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ స్వాప్ డీల్! లఖ్‌నవూకు రిషభ్ పంత్ గుడ్ బై.. ఏ జట్టుకు మారాడో తెలుసా?
-
Peddi: అనాథ పిల్లలకు రామ్ చరణ్ ఊహించని గిఫ్ట్
-
Nara Rohith : వారసుడొచ్చాడు.. తండ్రయిన నారా రోహిత్!
-
2027 Sankranthi : టాలీవుడ్ సీనియర్స్ వర్సెస్ కోలీవుడ్ స్టార్స్!
ట్రెండింగ్
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!
-
Vaibhav Suryavanshi: అది మంచి పద్ధతి కాదు.. వైభవ్ అలా చేయాల్సింది కాదు!