Daya Webseries Part 2 Update: హీరో జేడీ చక్రవర్తి రీ ఎంట్రీ ఇచ్చిన దయ వెబ్ సిరీస్ ప్రస్తుతానికి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. సావిత్రి, ప్రేమ ఇష్క్ కాదల్ వంటి సినిమాలు డైరెక్ట్ చేసిన పవన్ సాదినేని ఈ వెబ్ సిరీస్ ని డైరెక్ట్ చేయగా జేడీ చక్రవర్తి సరసన ఈషా రెబ్బా, రమ్యానంబీశన్, జోష్ రవి, పృథ్వి వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ మధ్యకాలంలో తెలుగులో వచ్చిన వెబ్ సిరీస్లు అన్నింటిలో ఈ వెబ్ సిరీస్ ఆసక్తికరంగా ఉందని ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వెబ్ సిరీస్ డైరెక్టర్ పవన్ సాదినేని తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఈ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ లో అనేక ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండానే అనేక అనుమానాలకు తావిచ్చే విధంగా ముగించారు. అలా ముగించడం వెనుక మరో మాస్టర్ ప్లాన్ ఉందని పవన్ వెల్లడించారు.
Eesha Rebba Pics: గ్లామర్ డోస్ పెంచిన ఈషా రెబ్బ.. లేటెస్ట్ స్టిల్స్ వైరల్!
తమ వెబ్ సిరీస్ కి సంబంధించిన సెకండ్ సీజన్ కూడా ఉంటుందని దానికోసం చాలా కీలకమైన విషయాలు రివీల్ చేయకుండా ఉంచమని చెప్పుకొచ్చారు. ఈ వెబ్ సిరీస్ బెంగాలీలో తెరకెక్కిన తక్ధీర్ అనే ఒక వెబ్ సిరీస్ ఆధారంగా తెరకెక్కించామని చెబుతూనే పూర్తిగా చేయకుండా ఒక పాయింట్ తీసుకుని కొత్తగా మళ్లీ కథ సృష్టించామని అన్నారు.. ఇక తమ వెబ్ సిరీస్ కు సంబంధించిన సెకండ్ సీజన్ షూటింగ్ మొదలు పెట్టాల్సి ఉందని ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నుంచి అన్ని అప్రూవల్స్ వచ్చాయి కానీ షూటింగ్ జరపటమే ఆలస్యం అని అన్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ రెండవ సీజన్ ఏప్రిల్ లేదా మే నెలలో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు.