Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది. ఎట్టకేలకు NBK 107 టైటిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీరసింహారెడ్డి టైటిల్ ను మేకర్స్ అధికారికంగా తెలిపారు. అఖండ సినిమా తరువాత బాలయ్య నటిస్తున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందులోను మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ చిత్రంలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక టాలీవుడ్ చరిత్రంలోనే మొట్టమొదటి సారి టైటిల్ లాంచ్ ఏర్పాటు చేసిన చిత్రంగా వీరసింహారెడ్డి మిగులుతోంది. కర్నూల్ లో కొండారెడ్డి బురుజు వద్ద ఈ టైటిల్ లాంచ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఇక ఈ సినిమా టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. బాలయ్యకు అచ్చొచ్చిన సంక్రాంతికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక పోస్టర్ లో పులిచర్ల మైలురాయి మీద స్టైల్ గా కాలు పెట్టి నిలబడ్డాడు. ఇక వెనుక బ్యాక్ గ్రౌడ్ లో బ్లాక్ కలర్ కారులు రావడం గమనించవచ్చు. ఈ పోస్టర్ చూస్తుంటే బాలయ్య పొలిమేరలో పోలికేకలు పెట్టించేలా ఉన్నాడు అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో బాలయ్య ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.