పుష్ప చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టాడు కోలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ . ఈ సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్ గా ఫహద్ నటనకు తెలుగు అభిమానులు ఫిదా అయిపోయారు. ఇక ఫహద్ తో పాటు ఆయన భార్య నజ్రియా నజీమ్ కూడా టాలీవుడ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అంటే సుందరానికి’. ఈ సినిమాలో నాని సరసన నజ్రియా నజీమ్ కనిపించనుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.
ఇకపోతే నజ్రియా కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఆమె అందం, ఆహార్యానికి కోలీవుడ్ లో ఆమెకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక తాజాగా ఈ కోలీవుడ్ బ్యూటీ అల్ట్రా స్టైలిష్ లుక్ లో దర్శనమిచ్చింది. పింక్ కలర్ షర్ట్ పై బ్లాక్ కలర్ జీన్స్.. కర్లీ హెయిర్.. పెద్ద కళ్ళజోడుతో అమ్మడి లుక్ అదిరిపోయింది. ఇక నజ్రియాను ఈ రేంజ్ లో చూసిన అభిమానులు షెకావత్ సారూ.. మీ భార్య భలే స్టైలిష్ గా ఉన్నారే అంటూ పుష్ప స్టైల్లో కామెంట్స్ పెడుతున్నారు.