Nayan-Vignesh: గత కొన్నిరోజులుగా కోలీవుడ్ ను ఊపేస్తున్న విషయం నయన్ సరోగససీ. కొన్నిరోజుల క్రితం నయన్- విగ్నేష్ తాము కవల పిల్లలకు జన్మ ఇచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఎప్పుడైతే ఆ విషయం బయటపడిందో చిత్ర పరిశ్రమ మాత్రమే కాకుండా తమిళనాడు ప్రభుత్వం కూడా నయన్ దంపతులపై ఫైర్ అయ్యింది. ఇండియా లో సరోగసీ బ్యాన్ చేశారు. అలాంటప్పుడు మీరెలా పిల్లలను కన్నారో వివరించాల్సిందిగా వివరణ అడిగారు. మరోపక్క నెటిజన్లు సైతం ఈ విషయాన్నీ హాట్ టాపిక్ గా మర్చి.. సరోగసీ తప్పు అని రుజువు అయితే నయన్ దంపతులకు మూడేళ్లు జైలు శిక్ష పడుతుందని కూడా మాట్లాడుకున్నారు. ఐయే ఇటీవలే విగ్నేష్ నెటిజన్లకు గట్టి కౌంటర్ ఇచ్చాడు. సమయం వచ్చినప్పుడు నిజానిజాలు అన్ని బయటికి వస్తాయని చెప్పడంతో పాటు అందరిని అప్పటివరకు వెయిట్ చేయమని చెప్పుకొచ్చాడు. ఇక ఆ వెయిటింగ్ సమయం ముగిసింది. ప్రభుత్వానికే ఈ జంట షాక్ ఇచ్చింది.
ప్రభుత్వానికి తాము అధికారికంగా బిడ్డలను జన్మనిచిన్నట్లు ఆధారాలతో సహా నిరూపించారట. ఈ సరోగసీ ఎప్పుడు అధికారం అవుతుంది అంటే.. సరోగసీ కోరుకొనే జంటకు పెళ్లై ఆరేళ్ళు కావాలి.. అద్దె గర్భం ఇచ్చే మహిళకు ఇదివరకే సొంత బిడ్డ ఉండి ఉండాలి.. ఆ మహిళ.. సరోగసీ కోరుకొనే జంటకు బంధువు అయ్యి ఉండాలి.. అన్నింటికి మించి ఆమె ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండకూడదు. ఇక ఇవన్నీ ఆధారాలతో సహా ఈ జంట నిరూపించి షాక్ ఇచ్చారు. నయన్- విగ్నేష్ జూన్ లో వివాహం చేసుకోవడమే అనేది మాత్రమే అందరికి తెల్సిన విషయం.. అయితే ఎవరికి తెలియని విషయమేంటంటే.. ఈ జంటకు పెళ్ళై ఆరేళ్ళు అవుతుందట.. అప్పట్లోనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ఈ జంట తమ వివాహ పత్రాన్ని దాఖలు చేశారు. ఇక అద్దె గర్భం మోసిన మహిళ నయన్ చుట్టాలమ్మాయి.. ఆమె దుబాయ్ లో ఉంటుంది. ఆమెకు ఆల్రెడీ పెళ్ళై ఒక బిడ్డ కూడా ఉన్నారట.. గతేడాది డిసెంబర్ లో ఒక హాస్పిటల్ లో ఈ ప్రాసెస్ జరిగినట్లు చెప్పుకొచ్చారు. మొత్తానికి ప్రభుత్వానికే ఈ జంట చుక్కలు చూపించిందనే చెప్పాలి. మరి నయన్ జంట ఇచ్చిన ఆధారాలతో ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.